ఏపీకీ తీపిక‌బురు అందించిన‌ కేంద్రం…

353
Titli Cyclone : AP Rs 539 and Kerala Rs 3048.39 crore to get from Centre for flood relief
Titli Cyclone : AP Rs 539 and Kerala Rs 3048.39 crore to get from Centre for flood relief

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్రం తీపిక‌బురు అందించింది. తిత్లీ తుఫాన్‌తో తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల‌కు కేంద్రం శుభవార్త చెప్పింది. తుఫాను కార‌ణంగా అక్క‌డి ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోవ‌వ‌డంతోపాటు భారీగా ఆస్తిన‌ష్టం కూడా సంభ‌వించింది. తుఫాను సాయం కింద రూ. 539.53 కోట్లు అదనంగా ఇవ్వాలన్న ప్రతిపాదనలకు కేంద్ర హోంశాఖ హైలెవల్ కమిటీ గురువారం ఆమోదం తెలిపిన‌ట్లు స‌మాచారం. రేపో ఎల్లుండో కేంద్రం అధికారి కంగా ప్ర‌క‌టించ‌నుంది.

తుఫాను కార‌ణంగా రూ. 3,435 కోట్లు న‌ష్టంగా అంచనా వేసి ఆ ప్ర‌తిపాద‌న‌ల‌ను కేంద్రానికి రాష్ట్ర‌ప్ర‌భుత్వం పంపించిన సంగ‌తి తెలిసిందే. అదే విధంగా కేంద్ర క‌రువు బృదం కూడా తుఫాను బాధిత ప్రాంతాల‌ను సంద‌ర్శించి న‌ష్టాన్ని అంచ‌నా వేసి ఆనివేదిక‌ను కేంద్ర‌హోంఖకు అందించింది.

దీనిలో భాగంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన గురువారం సమావేశమైన ఉన్నతస్థాయి కమిటీ పలు కీలక అంశాలపై చర్చించింది. తుఫాన్, వరదలకు వణికిపోయిన నాగాలాండ్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు సంబంధించిన నిధులపై ఈ ఉన్నతస్థాయి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న కేరళ రాష్ట్రానికి రూ. 3050 కోట్ల అదనపు సాయాన్నిఅందించింది.