Friday, March 29, 2024
- Advertisement -

రైతులకు ఆర్థికంగా అండగా “టొమాటో ఛాలెంజ్”

- Advertisement -

టొమాటో పండించే రైతులు బారి నష్టాలను చవిచూస్తున్నారు వారు ఎంతో శ్రమ పడి పండించిన పంట ఏ విధంగా లాభసాటిగా లేదు. వారు పండించిన పంటను ఏమిచేయాలో తెలియక రైతులు వాటిని సోషియల్ మీడియాలో పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు అమెరికా తెలుగు అసోసియేషన్ ఫర్ తెలుగు ఫార్మర్స్ గా ఏర్పడి వారికి ఎంతో కొంత మెలుచేయడానికి ముందుకు వచ్చారు.

నిజంగా ఆపదలో, అవసరంలో ఉన్న పేద రైతుల నుంచి పంటను కొనుగోలు చేసి వారికి ఎంతో కొంత మంచి చేయడం కోసం టొమోటో ఛాలెంజ్ ను విసురుకున్నారు. చాలా మంది ఈ ఛాలెంజ్ తీసుకుని సహాయం చేయడానికి ముందుకొచ్చారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఫర్ ఫార్మర్ (ఎటిఎఎఫ్ఎఫ్) ఎన్‌ఆర్‌ఐ టీమ్ ఆర్థికంగా మద్దతు ఇచ్చిన సభ్యులు డాక్టర్ వాసుదేవరెడ్డి .ఎన్. సుబ్బారెడ్డి, చింతగుంట వెంకట్ కల్లూరి (కెవి రెడ్డి), డాక్టర్ ప్రభాకర్ రెడ్డి చినపల్లి ఉన్నారు.

అలాగే ఇండియాలి డిస్ట్రిబ్యూట్ చేసిన టీమ్‌లో ప్రేమ్ కల్యాణ్ రెడ్డి, ఆర్.కె.రెడ్డి, సతీష్ రెడ్డి, భార్గవ్ సభ్యుల (స్నేహితుల) సహాయంతో అవసరం ఉన్న పేదలకు ఈ టొమాటోలను పంచటం జరిగింది. చిత్తూర్ జిల్లా లోని తంబలపల్లి, కొత్తకోట మండలాలు, నెల్లూరు జిల్లా వింజమూరు, పులివెందుల మామిడి వ్యవసాయదారులు వంటి మొత్తం 200 మంది నుండి ఉల్లి, క్యారట్, వంకాయలు, పచ్చి మిర్చి, మామిడి, కమల పళ్ళు కొని వాటినీ మొత్తంగా 250 టన్నుల ను 60,000 మందికి ఒక్కొక్కరికి 4 కేజీల చొప్పున అవసరంలో ఉన్న వారికి పంచటం జరిగింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -