Thursday, April 25, 2024
- Advertisement -

చలాన్లే కాదు.. గిఫ్టులు ఇస్తున్నారు

- Advertisement -

ట్రాఫిక్ పోలీసులంటే వాహనదారులు సహజంగా భయపడతారు. ఏదో ఒక సాకుతో చలాన్లు విధిస్తారన్న భావనతో ట్రాఫిక్ పోలీసులను తప్పించుకుని తిరుగుతారు. అయితే హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టి వాహనదారుల మన్ననలు పొందుతున్నారు.

ట్రాఫిక్‌ రూల్స్‌ను కచ్చితంగా పాటించే వారికి నజరానాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. పగలనక, రాత్రనక రహదారులపై విధులు నిర్వహించే ట్రాఫిక్ పోలీసులంటే ప్రతి ఒక్కరికి చులకన భావం ఉండేది. అయితే ఈ పరిస్థితిలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. గతంలో లాగా కఠినంగా కాకుండా ప్రజలకు అర్ధమయ్యే రీతిలో అవగాహన చేపడుతుండటంతో ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలకు క్రమంగా చేరువవుతున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా తమకు చిక్కినవారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి మొదటి తప్పిదంగా విడిచిపెడుతున్నారు.

అంతేకాదు నిబంధనల ప్రకారం వాహనాలను నడిపేవారిని గుర్తించి వారికి సర్‌ప్రైజింగ్ గిఫ్ట్‌లను అందిస్తున్నారు. వాహన కాగితాలతో పాటు లెసెన్స్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పాటించే వారిని గుర్తించి హైదరాబాద్‌ నగరంలోనే ప్రముఖ సినిమా థియేటర్ల టికెట్లుతో పాటు ప్రముఖ రెస్టారెంట్ల కూపన్లను అందజేస్తున్నారు. ఈ కూపన్లను నెల రోజుల వ్యవధిలో ఎప్పుడైనా వినియోగింకోవచ్చు. దండనతో కాకుండా పాజిటివ్‌ దృక్ఫథంతో ట్రాఫిక్‌ చేపట్టిన చర్యలను వాహనదారులు స్వాగతిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -