Thursday, March 28, 2024
- Advertisement -

ఆర్మీ చీఫ్ సంచలనం.. పీవీకే స్వాధీనానికి మేం రెడీ

- Advertisement -

గాంధీ పుట్టిన దేశం మనిది.. అహింసా మార్గంలో నడిచిన ప్రజాస్వామ్యం మనది. దాన్నే చేతకాని తనంగా భావించి పాకిస్తాన్ ఇన్నాల్లు ఉగ్రవాదులను ఎగదోసి భారత్ తో ఆడుకుంది. అయితే బీజేపీ వచ్చాక పరిస్థితి మారింది. కన్నుకు కన్ను.. చావుకు చావు.. పాకిస్తాన్ తో ఢీ అంటే ఢీ అంటోంది. తాజాగా భారత ఆర్మీచీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన ప్రకటన భారత్-పాకిస్తాన్ ల మధ్య ఉద్రికత్తలకు దారితీసింది.

పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ను (పీవీకే)ను స్వాధీనం చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారత ఆర్మీచీఫ్ జనరల్ బిపిన్ రావత్ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. దీనిపై కేంద్రమే నిర్ణయం తీసుకోవాలని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం పై ఆదేశిస్తే పీవీకేను స్వాధీనం చేసుకోవడానికి రక్షణ దళాలు సిద్ధంగా ఉన్నాయని.. అది పెద్ద పని కాదంటూ ఆర్మీ చీఫ్ సంచలన కామెంట్స్ చేశారు.

ఇక జమ్మూకశ్మీర్ భారతలోని రాష్ట్రమంటూ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన ప్రకటనను సత్యం, అదే వాస్తవం అంటూ ఆర్మీచీఫ్ వ్యాఖ్యానించారు.

ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్ లో శాంతి నెలకొంటుందని.. 30ఏళ్లుగా ఉగ్రవాదంతో నలిగిపోయిన కశ్మీరీలకు శాంతి నెలకొల్పేందుకు భారత్ ఆ రాష్ట్రాన్ని విభజించిందని ఆర్మీచీఫ్ తెలిపారు. శాంతితోనే అక్కడి ప్రజల జీవితాలు బాగుపడుతాయని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -