కరోనా వల్ల అమెరికాలో లక్ష మంది చనిపోవచ్చు : ట్రంప్

1158
Trump says, 'Covid could take up to 1 lakh lives in US'
Trump says, 'Covid could take up to 1 lakh lives in US'

తన అసమర్థత కారణంగా కరోనా వైరస్ అమెరికాలో వేగంగా విస్తరించిందన్న విమర్శలను ఎదుర్కుంటున్నారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఇలాంటి టైంలో ట్రంప్ చేసిన కామెంట్స్ సంచలనం అయ్యాయి. ప్రస్తుతం అమెరికాలో దాదాపు సగం రాష్ట్రాలు నిబంధనల్ని సడలించాలని అనుకుంటుండగా.. అప్పుడే ఎకానమీ మళ్లీ పుంజుకుంటుందని ఆశిస్తున్నాయి.

ఇక ట్రంప్ ఆలోచన కూడా ఇదే విధంగా ఉంది. దేశం మొత్తాన్ని లాక్ డౌన్ చేయలేమని ఇప్పటికే చాలా సార్లు చెప్పారు. ఇక కరోనా వైరస్ సోకి దాదాపుగా లక్ష మంది అమెరికన్లు చనిపోయే అవకాశందని ట్రంప్ అన్నారు. అయితే ఈ వైరస్‍ని కట్టడి చేసేందుకు ఈ ఏడాది చివరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని కూడా ధీమా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ నియంత్రణ, ఆర్థిక వ్యవస్థ పురుద్ధరణ, వ్యాక్సిన్‌ తయారీ తదితర అంశాల గురించి ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ మహమ్మారి వైరస్ పుట్టుకకు కారణమైన చైనా వల్లే ఆర్ధిక వ్యవస్థ తిరోగమనంలోకి వెళ్లిందని ఆ దేశంపై మండిపడ్డారు.

కరోనా వల్ల 80 వేల నుంచి లక్ష మంది ప్రజలను మనం పోగొట్టుకోబోతున్నామని.. ఇది చాలా భయంకరమైన విషయమని ట్రంప్ అన్నారు. ఇప్పటివరకు కరోనా కారణంగా 68వేల మంది చనిపోగా.. 11 లక్షల మందికి పైగా వైరస్ బారిన పడ్డారని ట్రంప్ అన్నారు. మరో 32 వేల మంది చనిపోతారని తెలిపాడు. ప్రస్తుతం అమెరికాలో రోజుకి వెయ్యి మంచి చనిపోతున్నారు. ఈ లెక్కన మే నెలాఖరు వరకు లక్ష మరణాలు ఉండొచ్చు అనేది అంచనా. ఇక రోజుకి 25 వేల మందికి పైగా కొత్తగా కరోనా కేసులు వస్తున్నాయి.

Loading...