Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ ను ఫాలో అవుతున్న కేసీఆర్

- Advertisement -

ఇన్నాల్లు కేసీఆర్ ను అందరూ ఫాలో అయ్యేవారు. కేసీఆర్ సృష్టించిన అద్భుతమైన పథకాలను పక్కా రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు కాపీ కొట్టారు. వాటిని అమలు చేశారు. ఇక కేసీఆర్ మానస పుత్రిక ‘రైతుబంధు’ను ఏకంగా కేంద్రంలోని బీజేపీ కాపీ కొట్టి కిసాన్ సమ్మాన్ గా అమలు చేస్తోంది.

ఇలా అందరూ కేసీఆర్ లోని జీనియస్ పథకాలకు జై కొడుతుంటే తాజాగా కేసీఆర్ మాత్రం ఇప్పుడు జగన్ ను కాపీ కొట్టడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వైఎస్ జగన్ చాలా రోజులుగా పెండింగ్ లో ఉన్న పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రతిపాదనను ఒక్క కలం పోటుతో ఇచ్చేసి వేలాది మంది పోలీసు కుటుంబాల్లో ఆనందం నింపారు. దీనికి అద్భుతమైన స్పందన పేరు రావడంతో తెలంగాణపోలీసులపై ఒత్తిడి పెరిగింది. తాజాగా తెలంగాణలోనూ పోలీసులకు వీక్లీ ఆఫ్ విధానం అమలు చేసేందుకు కేసీఆర్ కసర్తతు ప్రారంభించినట్టు తెలిసింది.

ఇప్పటికే కేసీఆర్ ముందుకు ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే కీలకమైన పోలీస్ శాఖలో వీక్లీ ఆఫ్ ఇస్తే పోలీసులు సరిపోతారో లేదో.. ఎమర్జెన్సీ వేళ కష్టమవుతుందని ఇది పెండింగ్ లో పెట్టాడు కేసీఆర్. కానీ ఇప్పుడు జగన్ అముల చేయడంతో కేసీఆర్ సర్కారుపై ఒత్తిడిపెరిగింది. సిబ్బంది కొరత, విధులు పెరిగిపోవడం వల్ల వీక్లీ ఆఫ్ అములు ఇన్నాళ్లు తెలంగాణలో సాధ్యం కాలేదు.

కేసీఆర్ సర్కారు , పోలీసులు ఇప్పుడు పోలీస్ నియామక ప్రక్రియలను పూర్తి చేసింది. కొత్తగా పోలీసులు కూడా వచ్చి చేరారు. దీంతో పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేయడానికి రంగం సిద్ధమైనట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -