వైవీ తిరుమల బూజు దులుపేస్తున్నాడా?

231
TTD chairman YV Subba Reddy to Revamp VIP Darshan System
TTD chairman YV Subba Reddy to Revamp VIP Darshan System

తిరుమలేషుడి దర్శనం కావాలంటే సామాన్య భక్తులకు మూడు చెరువుల నీళ్లు తాగినంత పని అవుతోంది. 24 గంటలు, 36 గంటలు.. అంటే దాదాపు రోజు, రోజున్నర సమయం క్యూలైన్లలో నిల్చోవాల్సిందే. అదే వీఐపీ బ్రేక్ దర్శనాలు మాత్రం గంటల పాటు ఉదయం సాయంత్రం కొనసాగిస్తారు. సామాన్యుల భక్తులను ఆపివేయించి వీఐపీల సేవలో తరిస్తున్న తిరుమలను ప్రక్షాళన చేయడానికి వైసీపీ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీసుకుంటున్న సంచలన నిర్ణయాలు చర్చనీయాంశంగా మారాయి.

తాజాగా వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానాల బూజు దులిపి ప్రక్షాళన చేయడానికి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా సామాన్యులను గంటల తరబడి వెయిట్ చేయించే వీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ వేయించాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

తాజాగా వీఐపీ బ్రేక్ దర్శనాలైన ఎల్1, ఎల్2, ఎల్ 3, బ్రేక్ దర్శనాల రద్దు చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వీఐపీలు ఏడాదికి ఒక్కసారి మాత్రమే తిరుమల దర్శనం చేసుకునేలా నిబంధన విధించబోతున్నారని తెలిసింది.

ఇక సామాన్యుల క్యూలైన్ కష్టాలకు చెక్ పడేలా త్వరగా వారికి దర్శనభాగ్యం కలిగేలా ఏర్పాట్లు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. ఇక వీఐపీ దర్శనాలకు ప్రత్యామ్మాయం ఆలోచిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలిసింది. దీంతో ఇక తిరుమల కష్టాలకు చెక్ పడనుంది.

Loading...