Friday, April 26, 2024
- Advertisement -

డిజిట‌ల్ సంత‌కాన్ని ఫోర్జరీ చేసినట్లు నేరం అంగీకరించిన రవిప్రకాశ్….

- Advertisement -

ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసు విచారణలో టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు హాజరయ్యారు. విచారణ నిమిత్తం గత మూడు రోజులుగా సైబర్‌ క్రైం పోలీసుల ఎదుట ఆయన హాజరైన సంగతి తెలిసిందే. రెండు రోజులుగా పోలీసుల‌కు స‌హ‌క‌రించ‌కుండా ఉన్న ర‌విప్ర‌కాశ్ డిజిటల్ సంతకం ఫోర్జరీకి చేసినట్టు రవిప్రకాశ్ అంగీకరించిన‌ట్లు తెలుస్తోంది. ఏవిధంగా ఫోర్జరీకి పాల్పడింది పోలీసులకు వివరించి చెప్పినట్టు సమాచారం.

మొదటి రోజు దాదాపు 5 గంటలపాటు పోలీసులు ఆయనను విచారించగా.. ఆయన నోరు మెదపలేదు. దీంతో నోటీసులు ఇచ్చి పంపించారు. ఇక రెండో రోజు విచారణకు హాజరైన రవిప్రకాష్ కేవలం ఒక్క ప్రశ్నకు మాత్రమే సమాధానమిచ్చారు.

ఎందుకు ఫోర్జరీ చేశారన్న పోలీసుల ప్రశ్నకు రవిప్రకాశ్ నోరుమెదపలేదని తెలుస్తోంది. కాగా, ఈ మూడు రోజుల విచారణలో పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాశ్ స్పందించలేదు. రవిప్రకాశ్ తమ విచారణకు సహకరించడం లేదని పోలీసులు చెప్పడం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -