Friday, April 19, 2024
- Advertisement -

టీవీ9 రవిప్రకాష్ కేసులో పోలీసుల నిర్ణయమిదే..

- Advertisement -

ముందున్నది టీవీ9 మాజీ సీఈవో.. పైగా న్యూస్ చానెల్స్ పుట్టుకకు ఆద్యుడు.. ప్రధానమంత్రి నుంచి రాష్ట్రముఖ్యమంత్రిగా తన జర్నలిజం తెలివితో గడగడలాండించిన మేధావి. అందుకే పోలీసులకు రవిప్రకాష్ కొరుకుపడడం లేదు. వారిని ముప్పుతిప్పలు పెడుతున్నాడు..

టీవీ9 సీఈవో రవిప్రకాష్ పై ఫోర్జరీ, డేటాచోరీ, టీవీ9 లోగో విక్రయాలపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసులపై హైకోర్టు, సుప్రీంకోర్టుకెళ్లిన రవిప్రకాష్ .. కోర్టు ఆదేశాల మేరకు విచారణకు వచ్చారు. అయితే విచారణలో పొంతన లేని సమాధానాలు చెబుతూ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు. ఎక్కడా దొరకకుండా..టీవీ9 స్థాపకుడిని తానేనని రవిప్రకాష్ పోలీసుల ప్రశ్నలకు చిక్కకుండా ఉంటున్నారు..

అయితే బయటకు వచ్చి మీడియాతో మాత్రం కేసును పక్కదోవ పట్టించేలా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీ9 రవిప్రకాష్ ను అరెస్ట్ చేస్తే న్యాయపరంగా చిక్కులు ఎదురవుతాయని భావిస్తున్న పోలీసులు ఈ కేసులో కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

రవిప్రకాష్ లాంటి తెలివైన జర్నలిస్టు విషయంలో ఎక్కడా తప్పు చేయరాదని పోలీసులు భావిస్తున్నారు. అందుకే ఆయనను అరెస్ట్ చేస్తే న్యాయపరంగా ఇబ్బందులు కాకుండా ఉండేందుకు కోర్టు ద్వారా ముందుకెళ్లాలని పోలీసులు నిర్ణయానికి వచ్చారు. కోర్టు ఆదేశాలను బట్టి తదుపరి అరెస్టా.? విచారణ కొనసాగించాలా అనేదానిపై పోలీసులు నిర్ణయం తీసుకుంటారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -