చత్తిస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌…ఇద్ద‌రు మావోలు హ‌తం…

300
Two Naxals killed in encounter with police in Chhattisgarh
Two Naxals killed in encounter with police in Chhattisgarh

చత్తీస్‌గఢ్ ఏజెన్సీలో మ‌రో ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. కాంకేర్‌ జిల్లా తడోకీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ముర్నార్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో డీఆర్జీ భద్రత బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.

ఈ క్రమంలో తాడోకి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూర్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఎదురుపడి కాల్పులకు దిగారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన బ‌ల‌గాలు ఎదురు కాల్పులు జ‌ర‌ప‌డంతో మావోయిస్టులు పారిపోయారు. అనంతరం భద్రతా బలగాలు ఘటనా స్థలిని పరిశీలించగా ఇద్దరు మావోయిస్టులు చనిపోవడం గుర్తించారు. అలాగే, వారికి సమీపంలో రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, 303, 315 తుపాకులు పడి వుండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు.

Loading...