Friday, April 19, 2024
- Advertisement -

హైదరాబాద్ లో ఢీకొన్న రెండు రైళ్లు..

- Advertisement -

హైదరాబాద్ లో భారీ ప్రమాదం జరిగింది. రైల్వే అధికారుల తప్పిదం కారణంగా రెండు రైళ్లు ఢీకొన్నాయి. హైదరాబాద్ లోని కాచిగూడలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు సోమవారం ఉదయం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. రెండు రైళ్లకు చెందిన బోగీలు రైల్వే ట్రాక్ నుంచి పక్కకు ఒరిగిపోయాయి.

కాచిగూడ రైల్వే స్టేషన్ లో సిగ్నల్ చూసుకోకుండా ఒకే ట్రాక్ పై రెండురైళ్లు రావడంతో ఈ ప్రమాదం సంభించినట్టు అధికారులు తెలిపారు.కాచిగూడ రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న ఇంటర్ సిటీ ప్యాసింజర్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. సాంకేతిక కారణాల కారణంగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రైళ్లు ఢీకొనడంతో ఆ రైల్వే ట్రాక్ పై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇంటర్ సిటీ రైలును చూసిన తర్వాత రైలు డ్రైవర్ బ్రేక్ వేశాడు. కానీ అప్పటికే స్పీడ్ కంట్రోల్ కాక ఎంఎంటీఎస్ రైలు ఇంటర్ సిటీని ఢీకొట్టింది. సిగ్నలింగ్ లోపం కారణంగానే ప్రమాదం చోటుచేసుకుంది. రెడ్ లైట్ కు బదులు.. గ్రీన్ లైట్ వెలగడంతోనే డ్రైవర్ పోనియ్యడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

రైల్వే స్టేషన్ కు సమీపంలో ఈ ప్రమాదం జరగడంతో రైలు స్పీడ్ తక్కువగా ఉండి భారీ ప్రాణనష్టం తప్పింది. ఎంఎంటీఎస్ లో ప్రయాణికులు తక్కువగా ఉండడంతో పెద్దగా ప్రాణనష్టం కలుగలేదు. ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ రెండు రైల్ ఇంజిన్ల మధ్య ఇరుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -