Wednesday, April 24, 2024
- Advertisement -

నియోజకవర్గాల్లో బాబుకు చుక్కలు కనబడటం ఖాయం

- Advertisement -

ఏపీలో ఫిరాయింపు రాజ‌కీయాల‌ను ప్రోత్స‌హించిన చంద్ర‌బాబు నాయుడికి ఇప్పుడు గుదిబండ‌గా మారింది.ఇన్నాల్లు నియేజ‌క వ‌ర్గాల పున‌ర్విబ‌జ‌న‌పై ఎన్నో ఆశ‌లు పెట్ట‌కున్న సీఎంకు చుక్క‌లు క‌నిపించ‌నున్నాయి.బాబు ఆశ‌ల‌పై కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు నీల్లు చ‌ల్లారు. పార్లమెంట్ వర్షాకల సమావేశాల్లోనే అసెంబ్లీ సీట్ల పెంపుపై బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం నుండి తనకు సమాచారం ఉందని అందుకే చంద్రబాబు కేంద్రమంత్రులపై ఒత్తిడి తేవాలంటూ ఎంపిలను చంద్రబాబు ఆదేశించారు.అయితే చంద్రబాబు మాటలకు పూర్తి విరుద్ధంగా పెద్దన్న వెంకయ్యనాయుడు వ్యాఖ్య‌లు ఉండ‌టం గమనార్హం.

న్యూఢిల్లిలో వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ సీట్ల పెంపు ఎప్పుడు పెరుగుతుందో తాను స్పష్టంగా చెప్పలేనన్నారు. చంద్రబాబుకు ఢిల్లీలో ఏ పని కావాలన్నా వెంకయ్యనాయుడే ప్ర‌ధానం. ఈ మధ్య గతంలో ఉన్నట్లుగా చంద్రబాబుకు వెంకయ్య మద్దతుగా నిలవలేకపోతున్నారు.

రాష్ట్ర విభజన చట్టంలో అసెంబ్లీ సీట్ల పెంపుకు హామీ అయితే ఉంది కానీ ఎప్పటిలోగా పెంచాలనే విషయంలో స్పష్టత లేదన్నారు. సీట్ల పెంపు విషయంలో తాను ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ, హోశాంఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో కూడా చర్చించిన విషయాన్ని వెంకయ్య తెలిపారు. సీట్ల పెంపు అంశం తన చేతుల్లో లేదన్న విషయాన్ని కూడా వెంకయ్య ప‌రోక్షంగా సెల‌విచ్చారు. చంద్రబాబు చెబుతున్నదాంట్లో వాస్తవం లేదని తేలిపోతోంది.

చంద్రబాబు మాటలకు వెంకయ్య మాటలకు పూర్తి విరుద్ధంగా ఉన్న విషయం గ‌మ‌నించివ‌చ్చు. సీట్ల పెంపు అన్నది చంద్రబాబుకు చాలా అవసరం. చంద్రబాబు ఆశిస్తున్నట్లు సీట్లు పెరగకపోతే మాత్రం కష్టాలను ఊహించలేం. ఎందుకంటే, వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు.

ఆ నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కోసం ఇప్పటి నుండే ఫిరాయింపు ఎంఎల్ఏలకు, పార్టీలోని సీనియర్ నేతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సీట్లు పెరుగుతాయని కాబట్టి అందరికీ టిక్కెట్లిస్తానంటూ చంద్రబాబు అందరినీ జో కొడుతున్నారు. అలాకాకుండా సీట్లు పెరగకపోతే చంద్రబాబుకు పై నియోజకవర్గాల్లో చుక్కలు కనబడటం ఖాయం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -