అన్ లాక్ 5.0: కొత్త నిర్ణయం తీసుకున్న కేంద్రం..?

1079
Unlock 5 guidelines: Relaxation seem likely for cinema halls and tourism
Unlock 5 guidelines: Relaxation seem likely for cinema halls and tourism

ఇప్పటికే కరోనా భారతేదేశంలో తగ్గుముఖం పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం దేశంలో చాలా వాటికి పర్మిషన్ ఇచ్చింది.. ఈ నేపథ్యంలో తాజాగా మరో మూడు రోజులలో మరిన్ని సడలింపులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంది.. దేశ వ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి అన్ లాక్ 5.0 సడలింపులు ఇవ్వనున్నారు. దసరా – దీపావళి సీజన్ ప్రారంభంకానున్న నేపథ్యంలో సినిమా హాల్స్, టూరిజం పచ్చజెండా ఊపనున్నారు.

కేంద్ర ప్రభుత్వం దీనిపై నేడో, రేపో నూతన విధివిధానాలు, మరిన్ని సడలింపులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో అన్ లాక్ 4.0ను సెప్టెంబర్ 30తో ముగించుకుని, అక్టోబర్ 1 నుంచి అన్ లాక్ 5.0లోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇప్పటివరకూ ఐదో విడత అన్ లాక్ పై మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించలేదు.

ఇటీవల వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ, మైక్రో-కంటెయిన్ మెంట్ జోన్ల ఏర్పాటు ఆలోచనను ప్రస్తావించారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్వల్ప కాల వ్యవధి లాక్ డౌన్ లు, కర్ఫ్యూలను విధించాలని యోచన కూడా ఉందని తెలిపారు. అక్టోబర్ నుంచి దసరా – దీపావళి పండగ సీజన్ మొదలు కానుంది. డిసెంబర్ నెలలో క్రిస్మస్ వేడుకలు ఉంటాయి. ఈ నేపథ్యంలో మరిన్ని నిబంధనలను సడలించడం ద్వారా పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

Loading...