Thursday, April 25, 2024
- Advertisement -

క‌ల్తీ మ‌ద్యానికి 30 మంది బ‌లి…

- Advertisement -

యూపీ, ఉత్త‌రా ఖాండ్ ప్రాంతాల్లో క‌ల్తీ మ‌ద్యం 30 మందిని బ‌లితీసుకుంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని సహరన్‌పూర్‌, ఖుషీనగర్‌ జిల్లాల్లో కల్తీ మద్యం తాగిన ఘటనలో 16 మంది మరణించారని అధికారులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబందించిన తొమ్మిది మంది అధికారుల‌ను స‌స్పెండ్ చేసిన‌ట్లు ఖుషీనగర్‌ జిల్లా మేజిస్ర్టేట్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు.మరోవైపు ఉత్తరాఖండ్‌లోని రూర్కీలో కల్తీ మద్యం సేవించిన ఘటనలో 14 మంది మరణించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన 13 మంది ఎక్సైజ్‌ అధికారులను సస్పెండ్‌ చేసినట్టు హరిద్వార్‌ ఎస్పీ వెల్లడించారు. వీరంతో రెండు రోజుల‌క్రితం ఆయా గ్రామాల్లో జ‌రిగిన వేడుక‌ల్లో ల్తీ మద్యం సేవించడంతో పలువురు తీవ్ర అస్వస్ధతకు గురవగా, మృతుల సంఖ్య పెరుగుతోంది. మృతుల కుటుంబాలకు రూ రెండు లక్షలు, అస్వస్ధతకు గురైన వారికి రూ 50,000 పరిహారం ప్రకటించారు యూపీ సీఎం. కల్తీ మద్యం ఘటనపై విచారణకు ఆదేశించామన్నారు అధికారులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -