మళ్లీ యుద్ధమేఘాలు.. చమురు సంక్షోభమేనా.?

238
US releases video it claims shows Iran removing mine from tanker
US releases video it claims shows Iran removing mine from tanker

అమెరికా-ఇరాన్ లొల్లి ప్రపంచంలో మరో చమురు సంక్షోభానికి దారితీస్తోంది. ఇరాన్ పై అమెరికా ఆంక్షలు.. ఆ దేశం నుంచి చమురు ను ఎవరు కొనుగోలు చేయవద్దని.. ఆ దేశంతో ఎలాంటి దిగుమతులు, ఎగుమతులు పెట్టుకోవద్దని అమెరికా ఆంక్షలు విధించింది. దీంతో భారత్ సహా వర్ధమాన దేశాలు ఇరాన్ తో పెట్టుకున్న చమురు ఒప్పందాలు క్లిష్టంగా మారాయి.

ఇరాన్ పై ఆంక్షలు నేపథ్యంలో ఆ దేశం మళ్లీ అణు పాఠవాలను ప్రదర్శిస్తోంది. దీంతో అమెరికా ఇప్పటికే గల్ఫ్ లో తన విమాన వాహక యుద్ధ నౌకలను మోహరించింది. పరిస్థితి చూస్తుంటే యుద్ధమేఘాలు కమ్ముకునేలాగానే ఉన్నాయి.

అయితే తాజాగా ఇరాన్ కు సమీపంలోని గల్ఫ్ ఆఫ్ ఒమన్లోని హోర్ముజ్ జలసంధి వద్ద సముద్రంలో నార్వే, జపాన్ లకు చమురు తరలిస్తున్న ఆదేశాల యుద్ధనౌకలపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో రెండు నౌకలు మునిగిపోయాయి. వేల లీటర్ల చమురు సముద్రంలో కలిసిపోయింది. ఇక ఈ నౌకలో చిక్కుకున్న 44 మంది సిబ్బందిని ఇరాన్ నేవీ రక్షించింది. ఈ ఓడలపై దాడితో ఇక యుద్ధమేఘాలు కమ్ముకొని క్రూడాయిల్ ధర 4శాతం పెరిగింది.

కాగా ఈ నౌకలపై దాడి ఇరాన్ పనే అని అమెరికా ఆరోపిస్తోంది. నార్వే, జపాన్ నౌకలపై దాడిలో ఇరాన్ హస్తం ఉందని మండిపడింది. అయితే తాము దాడి చేయలేదని.. ఆ నౌకలలోని సిబ్బందిని తామే రక్షించామని ఇరాన్ చెబుతోంది. దీంతో మరోసారి యుద్ధమేఘాలు ప్రపంచాన్ని కమ్మేశాయి. దీంతో చమురు సంక్షోభం తలెత్తి పెట్రోల్ ధరలు పెరిగి దేశాల జీడీపీ కూలిపోయే ప్రమాదం ఏర్పడే ప్రమాదం ఉంది.

Loading...