Friday, March 29, 2024
- Advertisement -

పాక్‌కు భారీ షాక్ ఇచ్చిన ట్రంప్‌…

- Advertisement -

అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్ కు మరోసారి భారీ షాక్ ఇచ్చింది. ఉగ్ర‌వాద నిర్మూల‌ణ‌లో ద్వంద‌వైఖ‌రి అవ‌లంబిస్తున్న పాక్‌కు రూ.9,260 కోట్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేసింది. ఇప్ప‌టికే పీక‌ల్లోతు ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు ట్రంప్ తీసుకున్న నిర్ణ‌యం మ‌రింత ష‌రాఘాతం కానుంది.

ఉగ్రవాదుల నిర్మూలనలో పాక్ వైఖరి మారకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అల్ ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ను అబోటాబాద్ లో రహస్యంగా పాక్ ఆశ్రయం ఇచ్చిందని ట్రంప్ విమ‌ర్శ‌లు చేసిన కొద్ది రోజుల‌కే అమెరికా ఈనిర్ణ‌యం తీసుకుంది.

ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తామని ఇంతకు ముందు పాక్ నేతలు అమెరికాకు చెప్పారు.. కేవలం మాటలే కానీ ఆ దిశగా పాకిస్తాన్ కఠినమైన చర్యలు తీసుకోవడం లేదు.. దీని వల్ల ఆ దేశానికి సమీపంలో ఉన్న పొరుగు దేశాలు తీవ్రవాదం వల్ల నష్టపోతున్నాయ‌ని పెద్ద‌న్న గుర్రుగా ఉంది.

అందుకే పాక్‌కు అందించే రక్షణ నిధులను నిలిపివేస్తున్నట్లు అమెరికా నిర్ణయం తీసుకుంది.. తాలిబన్, లష్కర్ ఏ తోయిబ వంటి ఉగ్రవాద సంస్థలపై పాకిస్తాన్ కఠిన చర్యలు తీసుకుంటే అఫ్గానిస్తాన్‌లోనూ శాంతియుత వాతావరణం నెలకొంటుంది. దీనివల్ల భారత్ తో సత్సంబంధాలు ఏర్పడతాయి’ అని అమెరికా రక్షణశాఖ అధికారి డేవిడ్ సిడ్నీ తెలిపారు. ఉగ్రవాదుల నిర్మూలనలో పాక్ సరిగ్గా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే అమెరికా రక్షణశాఖ పాక్ పై కొరడా ఝులిపించడం గమనార్హం.

గతంలో హక్కానీ నెట్‌వర్క్, తాలిబన్ ఉగ్రవాదుల కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు గాను.. గత సెప్టెంబర్‌లో పాకిస్తాన్‌కు 300 మిలియన్ డాలర్ల మిలటరీ సాయాన్ని ట్రంప్ సర్కార్ రద్దు చేసిన సంగ‌తి తెల‌సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -