Thursday, April 25, 2024
- Advertisement -

1000 లీట‌ర్ల మ‌ద్యాన్ని తాగిన తాగుబోతు ఎలుక‌లు ఎక్క‌డో తెలుసా..?

- Advertisement -

మ‌ద్యాన్ని మనుషులు తాగ‌డం సంహ‌జం. కానీ యూపీలో మాత్రం తాగుబోతు ఎలుక‌లు 1000లీట‌ర్ల మ‌ద్యాన్ని తాగాయంట‌. ఎలుక‌లు ఏంటి….? మ‌ద్యం తాగ‌డ‌మేంటి అనుకుంటున్నారా….? ఈ విష‌యం విడ్డూరంగా ఉన్నా యూపీ పోలులు ఇదే విష‌యాన్ని చెప్ప‌డంతో అక్క‌డ ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.

వివ‌రాల్లోకి వెల్తే….వివిధ ఘటనల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న 1000 లీట‌ర్ల మద్యం సీసాలను బరేలీ కంటోన్‌మెంట్‌ పోలీస్‌స్టేషన్‌‌కు చెందిన గోదాములో భద్రపరిచారు. ఇటీవ‌లే గోదాములోకి ప్ర‌వేశించిన ఓ కుక్క చ‌నిపోవ‌డంతో దుర్వాస‌న రావ‌డంతో పోలీసులు గోదామును తెరిచూడ‌గా వారికి షాక్ త‌గిలింది. అదే సమయంలో అక్కడ పెద్ద ఎత్తున మద్యం సీసాలు కనిపించలేదు. అలాగే, అక్కడున్న మరి కొన్ని డబ్బాలు ఖాళీగా ఉన్నాయని, వాటికి రంధ్రాలు ఉన్నాయని గుర్తించిన పోలీసులు ఎలుక‌లే తాగి ఉంటాయ‌ని పైఅధికారుల‌కు చెప్పారంట‌.

ఈ ఘ‌ట‌న‌పై స్పందించిన ఆ ప్రాంత ఎస్పీ అభినందన్‌ సింగ్ విచార‌ణ‌కు ఆదేశించారు. సాధారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న మద్యాన్ని మొదట గదుల్లో నిల్వ చేసి, వాటి శాంపిల్స్‌ తీసుకుని, ఆ తరువాత దాన్ని పారబోస్తారు. స్వాధీనం చేసుకున్న మద్యాన్ని నిబంధనల ప్రకారం నిరుపయోగం అయ్యేలా చేసే ప్రక్రియను ఎందుకు కొనసాగించలేదో తెలపాలని సిబ్బందిని ప్ర‌శ్నించారు.

ఇలాంటి సంఘ‌ట‌న‌లు గ‌తంలోనూ జ‌రిగాయి. గతంలో బిహార్‌లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని కూడా ఎలుకలే తాగాయని పోలీసులు పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో 2017లో స్వాధీనం చేసుకున్న 45 కేజీల మాదక ద్రవ్యాలనూ తినేశాయని పోలీసులు ఎలుకలపై ఆరోపణలుచేసిన సంగ‌తి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -