Thursday, March 28, 2024
- Advertisement -

కరోనా చైనా కుట్రే..ఒప్పుకున్నా చైనా వైరాలజిస్ట్..!!

- Advertisement -

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి కి కారణం చైనా అని అందరికి తెలిసిందే.. అయితే ఇది ప్రమాదవశాత్తు బయటపడింది. కావాలని చేసింది కాదు అని చైనా చెప్తుంటే ప్రపంచ దేశాలు మాత్రం చైనా ఈ విషయంలో గట్టిగానే నిందిస్తున్నాయి.. వాటికి ఊతంగా చైనాలోని వూహన్‌లో కరోనా వైరస్ మానవ నిర్మితం అయ్యిందని, వూహన్ సిటీలోని ఓ ల్యాబ్‌లో దీనిని తయారుచేసినట్లుగా చైనా వైరాలజిస్ట్ వెల్లడించారు. చైనాలోని వుహాన్ నగరంలో గతేడాది డిసెంబర్‌లో కరోనా వైరస్ మొదటి కేసు నమోదైంది.

ఆ తరువాత ఈ ఘోరమైన వైరస్ ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అప్పటి నుంచి COVID-19 వైరస్ మానవ నిర్మితమైనదని మరియు చైనాలో తయారు చేయబడిందని చైనాపై ఆరోపణలు ఉన్నాయి. కానీ కరోనా వైరస్ సృష్టించినట్లు వస్తున్న ఆరోపణలపై చైనా ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉంది.కరోనా వైరస్‌ను చైనా క్రియేట్ చేస్తుందని అమెరికా నిరంతరం ఆరోపిస్తోంది. అదే సమయంలో, ఐరోపాలోని చాలా దేశాలు కూడా ఈ ప్రమాదకరమైన వైరస్ మూలానికి చైనాను నిందించాయి. కానీ ఇప్పుడు చైనాకు చెందిన ఒక మహిళా వైరాలజిస్ట్ చైనాపై మరోసారి ప్రశ్నలు సంధించడంతో దీనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కరోనా వైరస్‌ మానవ నిర్మితమని ఆమె అంటున్నారు. చైనాకు చెందిన లి మెంగ్ యాన్ అనే ఓ మహిళా వైరాలజిస్ట్.. కరోనా వైరస్ మానవ నిర్మితమని చెబుతున్నారు.

కరోనా వైరస్ మానవ నిర్మితమని నిరూపించడానికి ఆమెకు తగిన సాక్ష్యాలు ఉన్నాయని చైనా వైరాలజిస్ట్ లి మెంగ్ యాన్ చెప్పారు. ఈ వైరస్ గురించి చైనా చాలా విషయాలు దాచిపెడుతోందని, ఇది చైనా మానవ నిర్మిత వైరస్ అని ఆమె అన్నారు. దీనికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. నేను వాటిని నిరూపిస్తాను అని వైరోలాజిస్ట్ లి మెంగ్ యాన్ చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ వుహాన్ మాంసం మార్కెట్ నుండి రాలేదని, ఇది వైరస్ ప్రకృతి ఉత్పత్తి కాదని అన్నారు. ఈ వైరస్ మాంసం మార్కెట్ నుంచి రాలేదని, ఈ ప్రమాదకరమైన వైరస్ వుహాన్ ల్యాబ్ నుండి వచ్చిందని, ఇది మానవ నిర్మితమని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -