Wednesday, April 24, 2024
- Advertisement -

మాల్యాకు షాక్ ఇచ్చిన యూకే కోర్ట్‌….

- Advertisement -

బ్యాంకుల‌కు వేల కోట్లు ఎగ‌వేసిన విజ‌య్ మాల్యాకు యూకే కోర్టులో ఎదురు దెబ్బ త‌గిలింది. భార‌తీయ స్టేట్ బ్యాంక్‌తో సంబంధం ఉన్న బ్యాంకుల‌కు మాల్యా సుమారు 9 వేల కోట్లు ఎగొట్టి లండ‌న్‌లో విలాస జీవితం గుడ‌పుతున్న మాల్యాను భార‌త్‌కు అప్ప‌గించేంద‌కు వెస్ట్‌మినిస్ట‌ర్ కోర్టు అనుమ‌తి ఇచ్చింది. మాల్యా కేసు విదేశాంగ శాఖ చూసుకుంటుంద‌ని కోర్టు వెల్ల‌డించింది.

రూ.9వేల కోట్ల మేర బ్యాంకులను మోసం చేయడం, మనీ లాండరింగ్‌కు పాల్పడటం వంటి నేరారోపణలున్న మాల్యాపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ దర్యాప్తు నుంచి తప్పించుకునేందుకు 2016లో ఆయన లండన్ పారిపోయారు. దీంతో మాల్యాను తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం బ్రిటన్ కోరింది. సుదీర్ఘ విచారణ అనంతరం మాల్యాను భారత్‌కు అప్పగించాలని న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై 14 రోజుల్లోగా అప్పీల్ చేసుకునేందుకు మాల్యాకు అవకాశం కల్పించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -