విజ‌య‌శాంతి అరెస్ట్‌…

222
Vijayasanthi Arrest in warangal
Vijayasanthi Arrest in warangal

తెలంగాణలో ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి తీవ్ర‌ ఉద్రిక్తతకు దారితీసింది.రాష్ట్రంలోని 31 జిల్లాల కలెక్టరేట్ల ముందు ఈరోజు ఆందోళన నిర్వహించింది. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌రేట్ల‌లోకి చొచ్చుకొని వెల్లేందుకు ప్ర‌య‌త్నించిన కాంగ్రెస్ నేత‌ల‌కు పోలీల‌సుకు మ‌ధ్య తోపులాట జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా వరంగల్ లో ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేత, నటి విజయశాంతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు నాయిని రాజేంద‌ర్ రెడ్డి, కొండా సురేఖ, కొండేటి శ్రీధర్ లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య‌శాంతి కేసీఆర్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలు జరిగి 5 రోజులు గడిచినా దొర మాత్రం ఎమ్మెల్యేలను కొనే బిజిలో ఉన్నారంటూ కేసీఆర్ పై మండి ప‌డ్డారు.20 మంది పిల్లలు చనిపోయినా ఆయనలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై దొర ఆటలు సాగవని వ్యాఖ్యానించారు. తొంద‌ర‌ప‌డి విద్యార్థులు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోరాద‌ని తాము అండ‌గా ఉంటామ‌ని బాధితుల‌కు ధైర్యం చెప్పారు.

Loading...