Thursday, April 25, 2024
- Advertisement -

కరోనా : బతికే అవకాశం ఉంటేనే చికిత్స.. పరిస్థితి చేయి దాటింది

- Advertisement -

అమెరికా అన్ని రంగంలో నంబర్ 1 అనిపించుకున్న దేశం. వైద్యసేవల విషయంలో కూడా ఇక్కడ నంబర్ 1. కానీ ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ తో అన్ని మారిపోయాయి. ఆమెరికాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బతికే చాన్స్ ఉన్న వారికే చికిత్స చేస్తున్నారు. వేలమందికి సరిపడా బెడ్స్ – వెంటిలేటర్లు – ఐసీయూలు – ఇతర వైద్య పరికరాలు లేవు.

దాంతో సెలెక్టెడ్ గానే వైద్యులు చికిత్స చేస్తున్నారు. ఇటలీ కూడా ఇదే పరిస్థితి ఉంది. వృద్ధులకు చికిత్స చేయకుండా వదిలేస్తున్నారు. ఆస్తమా – కేన్సర్ – కిడ్సీ సమస్యలు – గుండె సమస్యలు – ఊపిరితిత్తుల సమస్యలున్న వారికి – స్ట్రీట్ సైడ్ పీపుల్ కు కరోనా సోకితే వారిని వదిలేస్తున్న నిస్సహాయ స్థితి అమెరికాలో దాపురించింది. కరోనా కేసులో ఎక్కువగా అమెరికాలోనే ఉన్నాయి. ఖచ్చితంగా బతుకుతారు అని భరోసా ఉన్న వారికే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి చికిత్స చేస్తున్నారు.

ఐసీయూలో పెట్టినా – వెంటిలేటర్ అమర్చినా బతకరు అని భావిస్తున్న కేసులకు బయటే చికిత్స చేస్తున్నారు. వారు చనిపోతున్న స్థితి కనిపిస్తోంది. అమెరికాలో కరోనా రోగులకు 9 లక్షల వెంటిలేటర్లు కావాలి.. కానీ 2.25 లక్షలే ఉండడంతో ఇలా చేస్తున్నారు. ఇక నూయార్క్ లో అయితే పరిస్థితి మరి దారుణంగా ఉంది. అమెరికాకు ఆర్థిక రాజధాని న్యూయార్క్ లాక్ డౌన్ తో నిర్బంధం చేయడానికి ట్రంప్ సర్కార్ వెనుకాడుతోంది. ఇక అమెరికాలో ఉన్న తెలుగు వారు అనుక్షణం భయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -