Saturday, April 20, 2024
- Advertisement -

మేము త‌ప్పు చేశామ‌ని ఎవ‌రైనా ఒప్పుకుంటారా …?

- Advertisement -

ప్ర‌స్తుతం డ్రగ్స్ వ్యవహారం తెలుగు చిత్రసీమను కుదిపేస్తోంది. దాదాపు 15 మంది సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖుల‌కు విచారణ నిమిత్తం పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. నోటీసులు అందుకున్న స్టార్స్ మీడియా ముందుకు కొచ్చి త‌మ నిజాయితీని చెప్పుకున్నారు.

నిన్న‌టి వ‌ర‌కు గోప్యంగా ఉన్న వారి పేర్లు తెర‌మీద‌కొచ్చాయి. రవితేజ, సుబ్బరాజు, నవదీప్‌, తనీష్‌, ఛార్మి, ముమైత్‌ఖాన్‌.. ఇలా పలువురు డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నోటీసులు అందుకున్నట్లు స్పష్టమయ్యింది. విలన్‌ పాత్రల్లో ఎక్కువగా కన్పించే సుబ్బరాజు అయితే, నోటీసులు అందుకున్న మాట వాస్తవమేనని చెబుతూ, తనకు డ్రగ్స్‌ అలవాటు లేదనీ, నోటీసులు ఎందుకు వచ్చాయో తనకు అర్థం కావడంలేదనీ అన్నాడు.

నోటీసులు పంపారు గనుక, విచారణకు హాజరవుతానన్న సుబ్బరాజు, తన మీద తనకు పూర్తి నమ్మకం వుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కేసు నుంచి బయటపడ్తానని కాన్ఫిడెంట్‌గా చెబుతున్నాడు. ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, తనకు సిగరెట్‌ అలవాటు కూడా లేదని చెబుతుండడం గమనార్హం. కొంతమంద్రి కుట్రపూరితంగా తమ పేర్లను ఇరికించి వుంటారని ఇంకొందరు అంటున్నారు.

మొత్తంగా చూస్తే, టాలీవుడ్‌లో మేకు అంద‌రం శాఖాహారుల‌మే అని గ‌ట్టిగానే మాట వినిపిస్తోంది. అందరూ శాఖహారులే అయితే, గంప కింద కోడి పెట్ట ఏమయినట్లు.? ఈ ప్రశ్నకు సమాధానం అతి త్వరలోనే తెలియనుంది. అమాకులైతే అధికార‌లుకు ప‌ని లేకుండా నోటీసులు ఇచ్చారా..?

అన్నట్టు, రవితేజ సోదరులు భరత్‌, రఘు ఇప్పటికే చాలాసార్లు డ్రగ్స్‌ కేసులో బుక్కయ్యారు. వారి మీద కేసులుకూడా న‌మోద‌య్యాయి. ఇన్నాల్లు త‌మ్ముల్ల కార‌నంగానే చెడ్డ‌పేరు వ‌చ్చింద‌ని చెప్పుకుంటున్న ర‌వితేజ‌ ఇప్పుడు స్వయంగా డ్రగ్స్‌ కేసులో విన్పిస్తుండడం కొసమెరుపు.మేము త‌ప్పుచేశామ‌ని ఒప్పుకుంటారా ఏంటి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -