Saturday, April 20, 2024
- Advertisement -

న్యూస్ పేపర్ కింద ఉన్న ఈ చుక్కల అర్థం ఏమిటి….?

- Advertisement -

మనం పొద్దున్నే లేవగానే న్యూస్ పేపర్ చావుతుంటాం.. కొందరికి పేపర్ చదువంటే టీ అయినా తాగారు.. అలాంటి న్యూస్ పేపర్ రోజు చదువుతున్న కొన్ని మనం గమనించము.. ఉదాహరణకి న్యూస్ పేపర్లో న్యూస్ అంటే అర్థం తెలుసా? నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ అని. ఇదే కాదు ఇంకా కొన్ని మనం గమనించని విషయాలు న్యూస్ పేపర్ పై ఉంటాయి. అందులో ఒకటి న్యూస్ పేపర్ చివర్లో ఉండే చుక్కలు.

న్యూస్ పేపర్ చివరిలో దాదాపు నాలుగు చుక్కలు ఉంటాయి. అదికూడా ఒక్కొక్క చుక్క ఒక్కొక్క రంగులో ఉంటుంది. అలా ఉండడం వెనకాల కూడా ఒక అర్థం ఉంది. అది ఏంటంటే.ఆ చుక్కలు న్యూస్ పేపర్లో ప్రింట్ సరిగా ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సంకేతం. అప్పుడప్పుడు ఆ చుక్కలు సరిగ్గా ప్రింట్ అవ్వవు. అంటే ప్రతి చుక్క వెనకాల నీడ లాగ మరొక చుక్క ప్రింట్ అవుతుంది. దాని అర్థం న్యూస్ పేపర్ లో ప్రింటింగ్ అలైన్మెంట్ సరిగా లేదు అని. మీరు సరిగ్గా గమనిస్తే ఆ చుక్కలు ఎప్పుడూ ఒకటే ఆర్డర్లో ఉంటాయి.

ఆ ఆర్డర్ ని సీఎంవైకె (CMYK) సీక్వెన్స్ అంటారు. ఇందులో C అంటే సియాన్ (నీలి రంగు) అని,  M అంటే మెజెంటా (గులాబీ రంగు) అని,  Y అంటే ఎల్లో (పసుపు) , K అంటే బ్లాక్ (నలుపు) అని అర్థం..  మీరు ఒకసారి న్యూస్ పేపర్ తీసి గమనించండి. కింద చుక్కలు పైన చెప్పిన ఆర్డర్ ప్రకారమే ఉంటాయి. అలాగే పైన చెప్పిన విధంగా చుక్కల ని బట్టి ప్రింట్ ఎలా ఉంది అనే దాన్ని కూడా మీరు తెలుసుకోవచ్చు. కావాలంటే ఒకసారి ఇది కూడా ప్రయత్నించి చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -