Saturday, April 20, 2024
- Advertisement -

మధు ప్రియ ఏం తప్పు చేసింది ?

- Advertisement -

కొందరు మనుషులు చిన్న వయసులోనే జ్ఞానం సంపాదిస్తారు. మరికొందరు అరవయ్యేళ్ళు వచ్చినా అజ్ఞానంలోనే బతుకుతారు.బాధ్యత తెలియకుండా భార్యా బిడ్డలను గాలికి వదిలేసి తిరుగుతుంటారు. అందులో మధుప్రియ మొదటి కోవకు చెందిన అమ్మాయి.మధుప్రియ పెళ్లి వ్యవహారాన్ని జాతీయ సమస్య చేసి ,దాన్ని భూతద్దంలో చూసి, ఆమెకు సుద్దులు చెప్పే ప్రయత్నం చూస్తే కొంచెం ఆశ్చర్యం వేస్తోంది.

ఆ అమ్మాయి ప్రొఫైల్ చూస్తే తన మీద గౌరవం కలుగుతోంది. చిన్న వయసులోనే తన పాటతో రాష్ట్రమంతా చుట్టేసింది.

 తద్వారా తను సంపాదించిన అనుభవం అంతా ఇంతా కాదు. అలాగే చిన్న వయసులోనే విదేశాలకు వెళ్లి వచ్చింది. పేరు ప్రఖ్యాతులతో పాటు ఆత్మ విశ్వాసాన్ని సంపాదించుకుంది. ముప్ఫై ఏళ్ళ సగటు అమ్మాయిల కన్నా తన మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ.పదహారేళ్ళ కే ప్రేమలో పడటం తప్పు కాదు. రాజ్యాంగాన్ని గౌరవించి 18 ఏళ్ళు నిండెంత వరకు ఆగి పెళ్లి చేసుకోవటం ఆమె విజ్ఞతకు నిదర్శనం. ఆమె పెళ్లి ఆమె ఇష్టం. పూర్తిగా వ్యక్తిగతం. దాని మీద వ్యాఖ్యానించే హక్కు,అధికారం ఎవరికీ లేదు.ఆమె వ్యక్తిగత జీవితాన్ని తెలంగాణాకు ప్రతీకగా చిత్రిస్తూ,ఆమెను దూషించటం దుర్మార్గం.అయితే కొందరు ఆడపిల్లలు వున్న తల్లితండ్రులు అనవసర భయాందోళన కు గురవుతున్నారు. 

మధుప్రియ ను సమర్ధిస్తే తమ పిల్లలు ఎక్కడ తనను ఆదర్శంగా తీసుకొని వాళ్ళూ అలాగే చేస్తారేమో అనేది వారి భయం. అందుకే మధు పెళ్లి విషయాన్ని వ్యతిరేకిస్తూ పోస్ట్ లు రాసేస్తున్నారు. ఇది అన్యాయం. మధు శుభమా అని తానూ ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంది.చేతనైతే ఆశీర్వదించండి.లేదా మౌనంగా,దూరంగా వుండండి. అంతేకానీ, తనకు దుక్ఖం బాధా కలిగే రాతలు మాత్రం రాయకండి.

నిన్న సాయంత్రం ఆమె పెళ్లి ఘనంగా జరిగింది, తల్లి తండ్రుల మీద మీడియా లో ఆమె ఎలాంటి అనుచిత వ్యాఖ్యలూ చెయ్యకపోవడం ఆమె ఎదుగుదల కి నిదర్సనం .చిరంజీవి మధుప్రియ దంపతులకు ఆశీస్సులు,శతమానం భవతి.పిల్లా పాపలతో వందేళ్ళు వర్ధిల్లండి అని మా ఆధ్య తరఫున కోరుకుంటున్నాం . 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -