Thursday, April 25, 2024
- Advertisement -

మందుబాబులు త‌స్మాత్ జాగ్ర‌త్త‌.. మ‌ద్యం సేవించి 30 లక్షల మంది చనిపోయారంట‌

- Advertisement -

మందు బాబులం..మేము మందుబాబులం మందుకొడితే మాకు మేమే మ‌హారాజులం పాట ఏమోగాని మ‌ద్యం ప్రియులు మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాలంట‌. తాజాగా మందుబాబులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) సంచలన విషయాన్ని బయటపెట్టింది.

పూటుగా మద్యం సేవించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2016లో ఏకంగా 30 లక్షల మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్ వో తెలిపింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది మద్యం తాగుడుకి అలవాటు పడ్డారని.. వీరిలో 23.7 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది స్త్రీలు దానికి బానిసలై ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది.

మద్యం సేవించి కుటంబంలో అలజడి సృష్టించడం దాని ద్వారా ఎమోషన్స్ ఆపుకోలేక హింసలకు పాల్పడటం, ఆపై చంపడాలు లేదా చావడాలు జరుగుతున్నాయని రిపోర్ట్ పేర్కొంది. మద్యం ఎక్కువగా సేవించడం వల్ల క్యాన్సర్ ఇతరత్రా ఆరోగ్య సమస్యలు వచ్చి చాలా మంది మృతి చెందుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రాస్ అద్నామ్ చెప్పారు.

మద్యం తీసుకోవడంతో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. మద్యం మత్తులో వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పింది. మ‌త్తులో విచ‌క్ష‌ణ కోల్పోయి హ‌త్య‌లు, హ‌త్యాచారాలు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇలా మద్యానికి బానిసై ఇబ్బంది పడుతున్న వారిలో అమెరికా, యూరప్ ప్రజలు గణనీయంగా ఉన్నారని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఇక మద్యం సేవించేవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, కేన్సర్, మానసికస్థితి సరిగా లేకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది.

మద్యం సేవించిన కారణంగా జరిగే మరణాలు ఎక్కువగా అంటే 28 శాతాలు రోడ్డు ప్రమాదాల్లో గాయపడటం వల్ల, 21 శాతం జీర్ణవ్యవస్థలో సమస్యల వల్ల, 19శాతం శ్వాసకోశ సమస్యల వల్ల, మిగతా శాతం ఇన్ఫెక్షన్, క్యాన్సర్, ఇతరత్ర జబ్బులతో జరుగుతున్నవని డాక్టర్ టెడ్రాస్ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -