బిగ్ బాస్ లో ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరు..??

414
Who will be eliminated today in Bigg Boss
Who will be eliminated today in Bigg Boss

తెలుగు బుల్లి తెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్, ఇప్పుడిప్పుడే వీక్షకులను మరింత ఉత్సాహపరుస్తూ, ఆసక్తికరంగా సాగే దశలోకి ప్రవేశిస్తోంది. నిన్న శనివారం నాడు, హౌస్ మేట్స్ తో మాట్లాడిన హోస్ట్ నాగార్జున, నేడు ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారని చెప్పి, పెద్ద షాక్ నే ఇచ్చారు. అందులో ఒకరు కరాటే కల్యాణి అని ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోగా, రెండో వారు ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ వారం నామినేష‌న్స్‌లో 9 మంది పోటీదారులు ఉన్నారన్న సంగతి అందరికీ తెలిసిందే.

వీరిలో హౌస్ పార్టిసిపెంట్స్ లో అత్యంత వృద్ధురాలైన గంగ‌వ్వ‌ను బిగ్ ‌బాస్ సేఫ్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన నాగ్, మిగతా 8 మందిలో ఇద్దరు బయటకు రాబోతున్నారని, అందులో ఒకరు కల్యాణి అని కూడా చెప్పేశారు. దీంతో సూర్యకిరణ్ తరువాత బిగ్ బాస్ నుంచి బయటకు వస్తున్న రెండో పోటీదారుగా కల్యాణి నిలిచింది. ఇక నేడు జరిగే ఎపిసోడ్ లో మరొకరు కూడా బయటకు రానున్నారు. ఇదే సమయంలో ఇంటి సభ్యుల గురించి కల్యాణి ఏం చెబుతుందన్న విషయం కూడా ఆసక్తికరమే.

Loading...