Thursday, March 28, 2024
- Advertisement -

ట్రబుల్ షూటర్ కు ఆర్థికం అందుకేనా?

- Advertisement -

తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కేసీఆర్ వివరించిన తీరు చూస్తే ఇప్పుడు తెలంగాణ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని అర్థమైంది. చేసిన అప్పులకు గాను నెలకు 12వేల కోట్ల వరకూ వడ్డీనే కట్టాల్సిన పరిస్థితి ఉందని అర్థమైంది. ఆ అప్పులు తీర్చాలి.. సంక్షేమం, ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే మాటలుకాదు అని అవగతమవుతోంది.

ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 27535 కోట్ల బిల్లులు చెల్లించలేక పెండింగ్ లో పెట్టింది. సంక్షేమానికి, జీతాలకే నిధులు పోతున్నాయి. ఇక అప్పులు కట్టాల్సి ఉంది. దీంతో పాటు ముంచుకొచ్చిన ఆర్థిక మాంద్యం వల్ల జీఎస్టీ తగ్గి కేంద్రమే తెలంగాణకు దాన్ని భర్తీచేస్తోందని కేసీఆర్ మాటలను బట్టి అర్థమైంది. ఇప్పటికే జీఎస్టీ వల్ల తెలంగాణ వచ్చిన 170కోట్ల పైచిలుకు నష్టం జూన్ జూలై ల్లో కేంద్రం చెల్లించిందని.. ఇలాంటి పరిస్థితి తెలంగాణకు ఎప్పుడు రాలేదని కేసీఆర్ అసెంబ్లీలో ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్రాలు ఆర్థికమాంద్యంతో కుదేలయ్యాయని.. తెలంగాణ మాత్రం గుడ్డిలో మెల్లలా ఆర్థిక క్రమశిక్షణతో టైట్ లో ఉందని తెలిపారు..

తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని కేసీఆర్ వ్యాఖ్యలతో మనకు తేటెతెల్లమైంది. అందుకే కేసీఆర్ చేయిదాటిపోయిన తెలంగాణ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి ట్రబుల్ షూటర్ హరీష్ నే ఆశ్రయించడం విశేషం. ప్రస్తుతం ఆర్థికశాఖలో బిల్లులన్నింటిని కేసీఆర్ ఓకే అన్నాకే విడుదల చేస్తున్నారట.. అంతటి క్లిష్ట ఆర్థికశాఖ ఇప్పుడు ఏ పనినైనా సమర్థంగా చేసే హరీష్ భుజస్తంధాలపై కేసీఆర్ పెట్టడం విశేషం.

ట్రబుల్ షూటర్ గా పార్టీలో, ప్రభుత్వం సవాల్ గా తీసుకొని పూర్తిచేయడంలో హరీష్ దిట్ట. కాళేశ్వరం విజయంలో హరీష్ దే మెయిన్ రోల్. ఎన్నో ఓడిపోయే నియోజకవర్గాల్లో హరీష్ నిలుచుండి టీఆర్ఎస్ ను గెలిపించాడు. ఇప్పుడు కునారిల్లిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూసే కేసీఆర్ తన అల్లుడు హరీష్ ను ఏరికోరి ఆ పదవిలో కూర్చోబెట్టారని తాజాగా తెలంగాణ బడ్జెట్ ను చూస్తే అర్థమవుతోంది. కేబినెట్ లోనే వద్దనుకున్న హరీషే ముద్దయ్యాడంటే తెలంగాణ ఆర్థిక స్థితితోపాటు హరీష్ శక్తిసామర్థ్యాలు ఇక్కడ అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -