Wednesday, April 24, 2024
- Advertisement -

చంద్రబాబు అవినీతి కి ఎందుకు కొమ్ము కాస్తున్నాడు.?

- Advertisement -

గత కొన్ని రోజులుగా చంద్రబాబు వైఖరి చూస్తుంటే ప్రజలకు సైతం ఒకింత కోపానికి గురి చేస్తుంది.. జగన్ అధికారంలోకి వచ్చి కొన్ని నెలలే అయినా అప్పుడే జగన్ ను గద్దె దింపాలని అయన చేస్తున్న ప్రయత్నం చూస్తుంటే చంద్రబాబు కు జగన్ అంటే ఎందుకింత అసూయా అన్న భావన కలగక మానదు.. అంతేకాదు జగన్ ఏం చేసినా కూడా చంద్రబాబు ఏవిధంగానూ సపోర్ట్ చెయ్యట్లేదు.. అయినా జగన్ మంచి పరిపాలన అందిస్తూ ప్రజల్లో మంచి పేరు తో దూసుకుపోతున్నారు..

ప్రజలకు హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వాటిలో ఎలాంటి పొరపాట్లు, జాప్యం లేకుండా చూసుకుంటున్నారు.. అదే సమయంలో గతంలో అవినీతి కి పాల్పడ్డ నాయకుల చేమడాలు తీస్తున్నారు.. ఇప్పటికే చంద్రబాబు హయాంలో అవినీతి కి పాల్పడ్డ నేతలను జగన్ ఊచలు లెక్కపెట్టిస్తున్నాడు.. అచ్చెన్నాయుడు, కోళ్లు రవీంద్ర, జెసి ప్రభాకర్ రెడ్డి వంటి నేతలను అవినీతి కేసులో జైలుకి పంపగా మరికొంతమంది లిస్ట్ ను జగన్ తయారు చేశారు.. అమరావతి భూ కుంభ కోణాల్లో జరిగిన అవినీతి ని వెలికితీసే పనిలో జగన్ ఉన్నారు.. అలాగే ఇటీవలే సబ్బం హరి అక్రమంగా కట్టిన ఇల్లును సైతం విశాఖ లో కూల్చేశారు..

అయితే వీటిపై చంద్రబాబు వినూత్నంగా ప్రవర్తించడం తో అందరిలో ఒకింత అసహనం నెలకొంటుంది.. విశాఖలో 212 గజాల పార్క్ స్థలాన్ని ఆక్రమించిన సబ్బం హరిని కూడా వెనకేసుకు వస్తున్నారు. అక్రమనిర్మాణాలను విశాఖ మున్సిపల్ అధికారులు కూల్చేయగా అది కూడా కక్షసాధింపు అంటూ కామెంట్ చేస్తున్నారు. 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని చూసిన చంద్రబాబు ఇలా అక్రమార్కులను, అవినీతిపరులు, తప్పుడు పనులు చేసేవాళ్లను వెనకేసుకు రావడం ఏమిటని కార్యకర్తలే లోలోన బుగ్గలు నొక్కుకుంటున్నారు. వందలకోట్ల ఈఎస్ఐ అవినీతి కేసులో అరెస్టయిన అచ్చెన్నను పరామర్శించి వచ్చారు. ఆయన దూకుడును అడ్డుకునేందుకు అరెస్ట్ చేసారని మళ్ళీ ఒక స్టేట్మెంట్ పారేశారు. హత్యకేసులో అరెస్ట్ అయిన కొల్లు రవీంద్రను కూడా పరామర్శించి తప్పుడుకేసులో ఇరికించారని బురదజల్లారు. ఇప్పుడు కూడా నిజా నిజాలు తెలుసుకోకుండా సబ్బం విషయంలో నోరు జారుతున్నారు.. ఈ నేపథ్యంలో అక్రమార్కులను వెనుకోసుకొచ్చి చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు..

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

వారి కొసం జగన్ వ్యూహం ఎంటి..?

వైసీపీలోకి గంటా.. వెంటనే ట్విస్ట్ ఇచ్చిన సీఎం జగన్..!

ఛీ. పొమ్మన్న చంద్రబాబు బీజేపీ చెంతకే వెళ్తున్నాడంటే.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -