Friday, March 29, 2024
- Advertisement -

భయానక స్థితిలో సోదరుడి మృతదేహాన్ని చూడలేకే రాలేన‌న్న ర‌వితేజ మాట‌లు స‌మ‌ర్థ‌నీయ‌మా..?

- Advertisement -
Why Ravi Teja and His Family is not attained Brother Bharath Raju Funeral

అన్న పెద్ద స్టార్‌….అంద‌రూ ఉన్నా అనాధ‌లా చ‌నిపోవ‌డం త‌లుచుకుంటె చెప్పుకోలేనిది. ర‌వితేజ త‌మ్ముడు భ‌ర‌త్ మ‌ర‌ణం హాట్‌గామారింది. సోదరుడు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే, కనీసం చివరి చూపుకు సైతంక‌నీసం కుటుంబ‌స‌భ్యుల్లో ఒక్క‌రూ రాలేక‌పోవ‌డాన్ని ఎలా అర్థం చేసుకోవాలి..?

రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు కావడంతో, ఆ భయానక స్థితిలో సోదరుడి మృతదేహాన్ని చూడలేకే అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నట్లు రవితేజ సన్నిహితులతో చెప్పాడంటూ ప్రచారం జరిగిందిగానీ… అదంత సమర్థనీయంగా లేదు. నిజానికి, రవితేజ సోదరులు సినీ రంగంలో సాధించిందేమీ లేదు. పైగా, అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. పోలీసులతో దురుసుగా వ్యవహరించడం, మాదక ద్రవ్యాల కేసులు.. ఇలా రవితేజకి, తన సోదరుల కారణంగా ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యాయ‌నేది వాస్త‌వం.

{loadmodule mod_custom,GA1}

ఎన్నైనా కుటుంబ వివాదాలు వుండొచ్చు అది ఎవ‌రి కుటుంబంలోనైనా ఇది స‌హ‌జం. త‌మ్ముడి చివరి చూపు కోసమైనా రాకపోవడంతో రవితేజ చుట్టూ విమర్శలు పుట్టుకొస్తున్నాయి. రవితేజ ఆర్థికంగా అండదండలు అందించడం వల్లే, సోదరులిద్దరూ ఖరీదైన జీవితం గడుపుతున్నారన్న వాదనలు వున్నప్పటికీ, చివరి చూపుకు వెళ్ళలేదన్న అపప్రధ మాత్రం రవితేజని జీవితాంతం వెంటాడుతూనే వుంటుంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}SeURNN4Qq5A{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -