Thursday, March 28, 2024
- Advertisement -

గంగూలిపై పాక్ మాజీ కెప్టెన్‌ జావెద్‌ మియాందాద్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

- Advertisement -

పుల్వామా దాడి ఘ‌ట‌న ప్ర‌భాదం క్రికెట్‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. ప్ర‌పంచ క‌ప్‌లో పాక్‌తో ఆడ‌ద్దొని భార‌త్ మాజీ క్రికెట‌ర్ల‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. పంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని సూచించిన గంగూలీ… ఒక్క క్రికెట్‌ అనే కాదు.. హాకీ, ఫుట్‌బాల్ తదితర గేమ్స్ దాయాది దేశంతో భారత్ ఆడకూడదని సూచించాడు. అయితే గంగూలి వ్యాఖ్య‌ల‌పై పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ఘాటుగా స్పందించాడు. సౌరవ్ గంగూలీ రాబోవు ఎన్నికల్లో పోటీచేయాలని ఆశపడుతున్నాడేమో..? అతను ముఖ్యమంత్రి కావాలని ఆరాటపడుతున్నట్లున్నాడు. అందుకే.. ప్రచారం కోసం ‘మ్యాచ్ బహిష్కరణ’ వ్యాఖ్యలు చేసి అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాడంటూ వ్యాఖ్య‌లు చేశారు.

పాకిస్థాన్‌ను బ‌హిష్క‌రించాల‌ని బీసీసీఐ లేఖ రాస్తే అది అనాలోచిన నిర్ణ‌యం అవుతుంద‌న్నారు. అలా చేస్తే ఐసీసీ అమోదించ‌ద‌న్నారు. ఐసీసీ రాజ్యాంగం ప్రకారం సభ్య దేశాలకు అన్ని టోర్నీల్లో పాల్గొనే హక్కుంది . మ‌మ్మ‌ల్ని ఎలా బ‌హిస్క‌రిస్తార‌ని ప్ర‌శ్నించారు. ఒకవేళ బీసీసీఐ అలా చేస్తే అది ఒక అనాలోచిత పిచ్చి పనిగా మిగిలి పోతుంది’ అని మియాందాద్‌ పేర్కొన్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -