Friday, April 26, 2024
- Advertisement -

అమెరికా పరిస్థితి దారుణం : ఒక్క రోజే 10 వేల కేసులు..!

- Advertisement -

కరోనా వైరస్ కారణంగా అమెరికా పరిస్థితి దారుణంగా ఉంది. వైరస్ రావడంతో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. అమెరికాలో మంగళవారం ఒక్క రోజే అమెరికాలో ఏకంగా 10 వేల కేసులు నమోదు కాగా, 150 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో అమెరికాలో మొత్తం నమోదైన కేసులు 55 వేలకు చేరింది. మృతుల సంఖ్య 780 చేరింది.

ప్రధానంగా న్యూయర్క్ లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కేవలం ఒక్క రోజులోనే 53 మంది చనిపోయారు. కొత్తగా 5 వేల మందికి కరోనా సోకింది. కాలిఫోర్నియా, న్యూజెర్సీ, మిచిగన్, ఇల్లినాయిస్, ఫ్లోరిడాలలోనూ కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంది. తొలి కరోనా కేసు నమోదైన వాషింగ్టన్‌లో మాత్రం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాంతో ప్రభుత్వం అక్కడ ఊపిరిపీల్చుకుంది.

తాజా పరిస్థితిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పదిస్తూ.. ఏప్రిల్ 12 నాటికి సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌కు 24 లక్షల మాస్కులు, 1.35 కోట్ల గ్లౌజులు, 4 వేల వెంటిలేటర్లను పంపించనున్నట్లు తెలిపారు. అలానే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -