Saturday, April 20, 2024
- Advertisement -

ప్ర‌ముఖ తెలుగు న‌వ‌లా ర‌చ‌యిత్రి యద్ధ‌న‌పూడి సులోచ‌నారాణి క‌న్నుమూత‌….

- Advertisement -

ప్రముఖ రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి అమెరికాలో మరణించారు. కాలిఫోర్నియాలోని కుమార్తె నివాసంలో ఆమె గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. సులోచనా రాణి మరణించిన విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె వయసు 79 సంవత్సరాలు. యద్దనపూడి మృతిని ఆమె కుమార్తె శైలజ ధ్రువీకరించారు. ప్రస్తుతం తన కుమార్తె వద్ద కాలం గడుపుతున్న ఆమె మరణం నవలాలోకానికి తీరని లోటు. ఆమె మృతి పట్ల ఎమెస్కో విజయకుమార్ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజా గ్రామంలో జన్మించిన ఆమె, మధ్యతరగతి మహిళల ఊహలను, వాస్తవాలను తన నవలల్లో అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. 1970వ దశకంలో ప్రతి చదువుకునే స్త్రీ ఇంటా యద్దనపూడి నవల కనీసం ఒకటన్నా నిత్యమూ ఉండేదంటే అతిశయోక్తి కాదు.

యద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళామణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు. ఎక్కడా నేల విడిచి సాము చేయకుండానే తనదైన శైలితో అరుదైన రచనలు చేశారు. ముఖ్యంగా 1970వ దశకంలో ఆమె రచనలు సినీ ప్రపంచాన్ని కూడా ఓ ఊపు ఊపాయి. స్త్రీలు కాల్పనిక సాహిత్యంలో మేటిగా రాణిస్తున్న కాలంలో సులోచనా రాణి తనదైన సొంత మార్గంలో ఎన్నో నవలలు రాశారు.

వీరి నవలల్లో, కథల్లో భార్యాభర్తల మధ్య ప్రేమలు, కుటుంబ సంబంధాలు, స్త్రీల విషయానికి వస్తే మధ్య తరగతి అమ్మాయిల వ్యక్తిత్వం, ఆత్మ విశ్వాసం, హుందాతనం, మాటకారితనం కనిపిస్తాయి. ఎక్కువగా కోటీశ్వరుడైన నాయకుడు, కిందిస్థాయి నాయిక, విరిద్ధరి మధ్యా అంకురించే ప్రేమ. ఇదే వీరి నవలా సూత్రం. ఆగమనం, ఆరాధన, ఆత్మీయులు, అభిజాత, అభిజాతం, ఆశల శిఖరాలు, అమరహృదయం, మౌన తరంగాలు, దాంపత్యవనం, ప్రేమ, వెన్నెల్లో మల్లిక, కలల కౌగిలి, గిరిజా కళ్యాణం… … ఇలా సుమారు 40 నవలల వరకూ రాశారు.

ఆమె సినిమాల కూడా కథలను అందించారు. 1965లో మనుషులు – మమతలు సినిమాకు ఆమె కథ అందించారు. సులోచనా రాణి రాసిన మీనా, జీవన తరంగాలు, సెక్రటరీ, రాధాకృష్ణ, అగ్నిపూలు, ఛండీప్రియ, ప్రేమలేఖలు, విచిత్రబంధం, బంగారుకలం లాంటి నవలలు సినిమాలుగా వచ్చాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -