Friday, April 19, 2024
- Advertisement -

హైద‌రాబాద్‌లో దారుణం…ప్రేమోన్మాది దాడి..చావుబ్ర‌తుకుల్లో ఇంట‌ర్ బాలిక

- Advertisement -

హైద‌రాబాద్‌లో దారుణ సంఘ‌ట‌న చోట‌చేసుకుంది. ప్రేమించ‌లేద‌నే కోపంతో ఒ ప్రేమోన్మాది మధులిక బాళిక‌పై క‌త్తితో దాడి చేశాడు. దాడిలో గాయ‌ప‌డ్డ మ‌ధులిక తీవ్రాగాయాల‌తో య‌శోదా ఆసుప‌త్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ప‌రిస్థితి సీరియ‌స్ గా ఉంద‌ని 72 గంట‌లు గ‌డిస్తేగాని చెప్ప‌లేమ‌ని డాక్ట‌ర్లు వెల్ల‌డించారు.

కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సత్యనగర్‌‌కు చెందిన మధులిక ఈరోజు ఉదయం కాలేజీకి వెళ్లేందుకు బస్టాప్‌కు రాగా భరత్ అనే 19ఏళ్ల యువకుడు ఆమెను అడ్డుకున్నాడు. కొద్దిసేపు ఆమెతో వాగ్వాదానికి దిగిన భరత్ ఆపై వెంట తెచ్చుకున్న కొబ్బరిబోండాల కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో మధులిక మెడ, చాతి భాగం, చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే స్థానికులు మధులికను చికిత్స నిమిత్తం యశోదా ఆస్పత్రికి తరలించారు.

మధులికపై దాడి కేసులో నిందితుడు భరత్‌‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నాలుగు బృందాలతో భరత్‌ను పట్టుకున్నామని డీసీపీ రమేష్‌రెడ్డి తెలిపారు. ప్రేమను అంగీకరించలేదని మధులికపై భరత్ దాడి చేశాడని చెప్పారు. మధులిక ఇంటికి దగ్గర్లోనే భరత్‌ ఇల్లు ఉందని, కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడని డీసీపీ పేర్కొన్నారు. భరత్‌ నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మధులిక స్పృహలోకి వచ్చాక స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేస్తామని ఆయన చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -