Friday, March 29, 2024
- Advertisement -

హీరోయిన్ ఫోటో పెట్టి అబ్బాయి చాటింగ్…అరెస్ట్!

- Advertisement -

హీరోయిన్ ఫోటో ప్రొఫైల్ పిక్ పెట్టి, ఫేస్‌బుక్‌లో ఫేక్‌ అకౌంట్ క్రియేట్ చేయడం, అబ్బాయిలతో చాటింగ్ చేయడం కొంతమందికి సరదా. కానీ ఆ సరదా ఒకబ్బాయిని అరెస్ట్ వరకు తీసుకెళ్ళింది.

అదేంటంటే.. ఖమ్మం జిల్లా వైరా మండలం లోని గండుగుల ప్రాంతానికి చెందిన నిఖిల్ అనే కుర్రాడు తమన్నా ప్రొఫైల్ పిక్ పెట్టి ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, అమ్మాయిలకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపుతూ చాటింగ్ చేస్తున్నాడు. అబ్బాయిలను కూడా రెచ్చగొడుతూ చాటింగ్ చేస్తున్నాడట. ఇది తెలుసుకున్న కొంతమంది అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్‌కి ఇన్‌ఫామ్ చేయటంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇలాంటి ఫేక్ అకౌంట్లు ఫేస్‌ బుక్‌లో సర్వ సాధారణమైనప్పటికి.. ఇతను అమ్మాయిలాగా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి, అమ్మాయిలాగే చాటింగ్ చేస్తుండటంతో విషయం పోలీసుల వరకు వెళ్ళింది. అతనిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని నిఖిల్‌ పేరెంట్స్, బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గర గొడవకు దిగారు. ఒక్క ఫేస్‌బుక్ ఫేక్ అకౌంట్ ఇంత రచ్చ చేసింది మరి.     

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -