Friday, March 29, 2024
- Advertisement -

లోకేష్ కు షాకిచ్చిన జగన్ ప్రభుత్వం..

- Advertisement -

వైఎస్ జగన్ సీఎంగా గద్దెనెక్కగానే సంచలన నిర్ణయాలకు వేదిక అవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీసే పనిలో పడ్డారు. ఇక బాబు కట్టిన అక్రమ నిర్మాణమైన ప్రజావేదికను కూల్చడానికి జగన్ నిన్ననే ఆదేశాలిచ్చాడు. దానిపక్కనే చంద్రబాబు ప్రస్తుత నివాసాన్ని ఏం చేస్తారన్నది ఉత్కంఠగా మారింది.

అయితే మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు, ఆయన ఫ్యామిలీ అనుభవిస్తున్న జడ్ ప్లస్ కేటగిరి భద్రతను వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా ఉపసంహరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు ఓడిపోవడం.. ప్రతిపక్ష నేతగా మారిపోవడంతో ఆయనకు ఇన్నాళ్లు ఉన్న జడ్ ప్లస్ భద్రతను తగ్గించారు.

తాజాగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు సైతం భద్రతను తగ్గిస్తూ జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం లోకేష్ కు జడ్ కేటరిగి భద్రత ఉండేది. ముఖ్యమంత్రి కుమారుడిగా, ఎమ్మెల్సీగా ఉండడంతో 5+5 భద్రత సిబ్బంది ఉండేవారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం దాన్ని 2+2కు మాత్రమే పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది.

కాగా జగన్ ప్రతిపక్షంలో ఉండగా.. ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రభుత్వం కల్పించిన భద్రతనే ఇప్పుడు కల్పిస్తున్నామని వైసీపీ మంత్రులు వాదిస్తున్నారు. మరి భద్రత తగ్గించడంపై చంద్రబాబు ఎలా స్పందిస్తాడన్నది వేచిచూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -