తిరుమ‌ల‌లో ఒక సామాన్యుడుగానే స్వామి ద‌ర్శ‌నం చేసుకున్న జ‌న‌నేత‌..

527
YS Jagan Mohan Reddy Visit Tirumala
YS Jagan Mohan Reddy Visit Tirumala

ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. పాద‌యాత్ర ముగియ‌డంతో అలిపిరినుండి కాలిన‌డ‌క‌న తిరుమ‌ళ చేరుకున్న జ‌గ‌న్ మధ్యాహ్నం 1:40 నిమిషాలకు అలిపిరి నుండి తిరుమలకు బయలు దేరిన జ‌గ‌న్ తిరుమలలోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్‌ జగన్‌ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు.