Saturday, April 20, 2024
- Advertisement -

జ‌గ‌న్ చేయించిన ఐదు స‌ర్వేల్లో ఎవ‌రూ ఊహించ‌ని ఫ‌లితాలు

- Advertisement -

ఏపీలో ఎన్నిక‌లు ముగిసి నెల రోజులు దాటింది. ఫ‌లితాల కోసం అంద‌రూ ఆత్రుత‌గా ఎదురు చూస్తున్నారు. ఈనెల 23న ఫ‌లితాలు వెలువ‌డుతుండంతో రాజు ఎవ‌రో బంటు ఎవ‌రో తేలిపోనుంది. పోలింగ్ ముగిస‌న‌ప్ప‌టి నుంచి ప‌రిస్థితులు ఒక సారి గ‌మ‌నిస్తే బాబు, జ‌గ‌న్‌కు ఉన్న తేడా ఏంటో తెలుస్తుంది.

పోలింగ్ ముగిసిన వెంట‌నె బాబు దేశ మంతా కాల్లు అరిగిఓయేలా తిరిగారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్ల‌పై ఓ చిన్న‌పాటి యుద్ద‌మే చేశారు. ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెల‌సి నానా యాగి చేశారు.వీవీప్యాట్ల‌ను 50 శాతానికి పైగా లెక్కించాల‌ని సుప్రీకోర్టుకు వెల్లారు. కాని అక్క‌డ కూడా బాబుకు చుక్కెదురు అయ్యింది.

ఇక జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తె పోలింగ్ ముగిసిన త‌ర్వాత బాబు లాంటి చౌక‌బారు రాజ‌కీయాలు చేయ‌లేదు. ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు చూద్దాంలే అనిసైలెంట్‌గా ఉన్నారు.కచ్చితంగా గెలుస్తామన్న ఉద్దేశంతో ఉన్న ఆయన.. ఎందుకైనా మంచిదని తెరవెనక కొన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలిసింది.

ఈనెల రోజుల్లో సైలెంట్‌గా జ‌గ‌న్ ఐదు స‌ర్వేలు చేయించిన‌ట్లు స‌మాచారం. రైతులు, మహిళలు, యువత, పట్టణ ప్రజలు, పల్లె జనం ఇలా ఎవరెవరు ఎవరికి ఓటు వేశారన్న అంశంపై వర్గాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఐదు రకాల సర్వేలు చేయించి వాట‌న్నింటిని విశ్లేషించిన‌ట్లు తెలుస్తోంది. అన్ని స‌ర్వేల్లో ఫ‌లితాలు టీడీపీ కంటె వైసీపీకే ఎక్కువ‌గా ఉండ‌టంతో జ‌గ‌న్‌లో మ‌రింత ధీమా పెరిగింది.

వైసీపీ చేసిన ఐదుర‌కాల స‌ర్వేల‌ల్లో 100 సీట్లు వస్తాయని తేలిన‌ట్లు సమాచారం. 100 సీట్ల‌కు ఒక్క సీటు కూడా త‌గ్గ‌ద‌ని తేల‌డంతో జ‌గ‌న్ పూర్తి న‌మ్మ‌కంతో ఉన్నారు.అలాగే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 25 పార్లమెంటరీ స్థానాలుండగా… వైసీపీకి కచ్చితంగా 18 సీట్లు దక్కుతాయని సర్వేల్లో తేలిదంట. జాతీయ రాజ‌కాయ‌ల‌కంటె ముందుగా రాష్ట్రంలో మీద‌నె ఫోక‌స్ పెట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. ఎందు కంటె 2024లో ఎన్నికల ప్రచారం చెయ్యకపోయినా, ప్రజలే స్వయంగా తమకు ఓటు వేసేలా పాలన ఉండాలని జగన్ కోరినట్లు తెలిసింది.

మిగితా 75 స్థానాల విష‌యంపై కూడా జ‌గ‌న్ చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. 75 స్థానాల్లో ఎందుకు వైసీపీకి అవకాశాలు తక్కువగా ఉన్నాయన్నదానిపై ఆరాతీసిన‌ట్లు పార్టీ వ‌ర్గాల‌నుంచి స‌మాచారం.టీడీపీ పట్ల ప్రజల్లో పూర్తిగా వ్యతిరేకత రాలేదనీ, ఇప్పటికీ ఆ పార్టీకి బలం ఉందనీ సన్నిహితులు చెప్పినట్లు సమాచారం. కోస్తా జిల్లాల్లో వైసీపీ బలపడినా, జనసేన ప్రభావం కొంతవరకూ కనిపిస్తోందనీ, అందువల్ల వైసీపీ గెలిచే అవకాశాలున్న చోట్ల జనసేన ఓట్లను చీల్చిందని సర్వే నిర్వాహకులు జగన్‌కు చెప్పినట్లు తెలిసింది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి మేజిక్ మార్క్ 88 కాబట్టి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌డానికి ఎలాంటి ఇబ్బంది ఉండ‌ద‌ని జ‌గ‌న్ ధీమాతో ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -