Friday, April 19, 2024
- Advertisement -

నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50% …వైఎస్ జ‌గ‌న్‌

- Advertisement -

ఏలూరులో జ‌రిగిన వైసీపీ బీసీ గ‌ర్జ‌న స‌భ‌లో ఆ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి బీసీ కులాల‌కు వ‌రాలు కురిపించారు. త్వ‌ర‌లో జ‌రిగే ఎన్నిక‌ల్లో మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే బీసీల‌కు అన్ని నామినేటేడ్ ప‌దువుల్లో బీసీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు అమలు చేస్తామ‌ని హామీ ఇచ్చారు. దీనికోసం చ‌ట్టం తీసుకొస్తామ‌న్నారు.నామినేషన్ పనుల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. షాపులున్న ప్రతి నాయీబ్రాహ్మణుడికి ఉచితంగా ఏడాదికి రూ.10 వేలు అందజేస్తామన్నారు.

బీసీ వర్గాల్లోని అన్ని కులాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, బీసీల్లోని 139 కులాలకు విడివిడిగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 ఏళ్లు నిండిన ప్రతి బీసీ మహిళకు వైఎస్సార్‌ చేయూత కింద రూ. 75వేలు ప్రతి ఏడాది నేరుగా అందజేస్తామని ప్రకటించారు.

ప్రధాన ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం తోపాటు ఆలయాల్లో బోర్డు మెంబర్లుగా నాయీ బ్రాహ్మణులు, యాదవులకు అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సంచార జాతులకు ఉచితంగా ఇల్లు, ఉపాధి అవకాశం కల్పిస్తామని, వారి పిల్లల కోసం ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు రూ.10 వేలు ఇస్తామని, ప్రమాదవశాత్తు చనిపోయిన మత్స్యకారులకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా కింద ఇస్తామని హామీ ఇచ్చారు.మగ్గం ఉన్న ప్రతి చేనేత మహిళకు ప్రతి నెలా రూ.2 వేలు ఇస్తామని, పేదవాడు ప్రమాదవ శాత్తు చనిపోతే కనుక బీమా కింద రూ.7 లక్షలు అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.

ఎన్ని లక్షలు ఖర్చైనా ఉచితంగా చదివిస్తాం. హాస్టల్‌లో ఉండి చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ. 20వేలు ఇస్తాం. పిల్లలను బడికి పంపించిన ప్రతి తల్లికి ఏటా రూ. 15వేలు ఇస్తాం’ అని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కులం సర్టిఫికెట్లు, గ్రూపుల మార్పిడి, ఎంబీసీలతోపాటు బీసీల సమస్యలు పరిష్కరించేందుకు బీసీ కమిషన్‌ పనిచేస్తుందని తెలిపారు.

రాష్ట్రంలోని 31 బీసీ కులాలు కేంద్రం పరిధిలోని ఓబీసీ జాబితాలో లేవని, అయినా నాలుగున్నరేళ్లు కేంద్రంలో బీజేపీతో సంసారం చేసిన చంద్రబాబు ఈ కులాల కోసం కేంద్ర ప్రభుత్వానికి ఒక్క లేఖ కూడా రాయలేదని వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి 32 కులాలను బీసీ జాబితాలో చేర్పిస్తామని వెల్లడించారు.

మా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగాల్లో 50శాతం ఉద్యోగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు వచ్చేలా ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులు అందజేసి.. రూ. 10వేల వరకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -