Saturday, April 20, 2024
- Advertisement -

జ‌గ‌న్ కేబినేట్ డ్రీమ్‌ లిస్ట్‌…ఇది నిజ‌మా…?

- Advertisement -

ఫ‌లితాల‌కు వారం రోజుల స‌మ‌యం ఉండ‌టంతో ఫ‌లితాల‌కోసం అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల‌నేత‌లు ఉత్కంఠ‌గా ఎదురుచూస్తున్నారు. విజ‌యం మాదంటె మాదేన‌ని టీడీపీ, వైసీపీలు ధీమాగా ఉన్నాయి. అయితే వైసీపీ ఒక‌డుగు ముందుకేసి కేబినేట్ కూర్పును కూడా ఎలా ఉండాలో నిర్ణ‌యించేశార‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే మంత్రి ప‌ద‌వుల‌కోసం ఆశావ‌హులు త‌మ ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు.

ఇద‌లా ఉంటె ఇప్పుడు ఓలిస్ట్ తయారు చేసి ఇదీ జగన్ డ్రీం కేబినెట్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ కాస్త హల్ చల్ చేస్తోంది . తాజాగా జగన్ డ్రీం కేబినెట్ అంటూ ఒక లిస్ట్ రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇక ఆ లిస్ట్ కూడా చాలా వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు ఉంది.

ముఖ్యమంత్రి : వై యస్ జగన్మోహన్ రెడ్డి
స్పీకర్ : దగ్గుబాటి వెంకటేశ్వర రావు
డిప్యూటీ స్పీకర్ : పాముల పుష్ప శ్రీవాణి

మంత్రులు …………….శాఖలు

  1. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -హోంశాఖ
  2. బొత్స సత్యనారాయణ -రోడ్లు మరియు భవనాలు
  3. ధర్మాన ప్రసాదరావు -రెవెన్యూశాఖ
  4. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి -ఆర్థిక శాఖ
  5. కొడాలి నాని -భారీ నీటిపారుదల శాఖ
  6. గడికోట శ్రీకాంత్ రెడ్డి -మున్సిపల్ శాఖ
  7. తానేటి వనిత -స్త్రీ, శిశు సంక్షేమ శాక
  8. పిల్లి సుభాష్ చంద్రబోస్ -పౌర సరఫరాలుశాఖ
  9. అవంతి శ్రీనివాస్ -వైద్య ఆరోగ్యశాఖ
  10. కురసాల కన్నబాబు -విద్యాశాఖ
  11. తమ్మినేని సీతారాం -బీసీ సంక్షేమం
  12. శిల్ప చక్రపాణి రెడ్డి -అటవీశాఖ
  13. వై. విశ్వేసర్ రెడ్డి -న్యాయశాఖ
  14. కోన రఘుపతి -దేవాదాయ ధర్మదాయశాఖ
  15. ఆనం రాంనారాయణ రెడ్డి -పంచాయితీరాజ్
  16. మోపిదేవి వెంకటరమణ -ఐటీ శాఖ మంత్రి
  17. ఆర్. కే. రోజా -విద్యుత్ శాఖ
  18. బాలినేని శ్రీనివాస్ రెడ్డి -భూగర్భ గనులశాఖ
  19. గ్రంధి శ్రీనివాస్ -సినిమాటోగ్రఫీ
  20. ఆళ్ళ నాని -కార్మిక, రవాణా శాఖ
  21. కె. భాగ్యలక్ష్మి -సాంఘీక సంక్షేశాఖ
  22. ఆళ్ళ రామకృష్ణ రెడ్డి -వ్యవసాయ శాఖ మంత్రి
  23. అమంచి కృష్ణ మోహన్ -మార్కెటింగ్ మరియు పశు సంవర్థక
  24. కె. ఇక్బాల్ అహ్మద్ -పర్యావరణ శాఖ
  25. కొక్కిలిగడ్డ రక్షణనిధి -హౌసింగ్
  26. కాకాని గోవర్ధన్ రెడ్డి -భారీ పరిశ్రమల శాఖ

ఫ‌లితాలు రాక‌ముందె సోష‌ల్ మీడియాలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ జాబితాను వైసీపీ వర్గాలు ధృవీకరించడం లేదు. ఇది ఎవ‌రు పోస్ట్ చేశార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -