Saturday, April 20, 2024
- Advertisement -

న‌గ‌రిలో రోజా జ‌బ‌ర్ద‌స్త్ గెలుపు…జ‌గ‌న్ క్యాబినేట్‌లో చోటు

- Advertisement -

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా న‌గ‌రి నుంచి గెలుపొందారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి పోటీకి దిగిన ఆమె… ఎన్నికల్లో విజయం సాధించారు. మ‌రో వైపు ఈసారి రోజాను ఓడించాల‌ని చంద్ర‌బాబు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ ఇన్నీకావు. వాట‌న్నింటిని చిత్తు చేసిన రోజా గెలిచింది. రోజా గెలిస్తే ఆపార్టీ అధికారంలోకి రాద‌నె అప‌వాదునుంచి ఈసారి రోజా బ‌య‌ట‌ప డింది.

గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రోజా.. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడుపై పోటీ చేసి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ పై 2వేల 681 ఓట్ల మెజారిటీతో ఆమె గెలుపొందారు. 

2004లో నగరి, 2009లో చంద్రగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన రోజా 2009లో ఓటమి తర్వాత వైఎస్ బతికి ఉండగానే కాంగ్రెస్‌లోకి చేరిపోయారు. వైఎస్ మరణాంతరం వైసీపీలోకి వెళ్లడంతో పాటు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయడంతో జగన్ గత ఎన్నికల్లో ఆమెకు నగరి సీటు ఇచ్చారు. 2014 ఎన్నిక‌ల్లో రోజా గెలుపొందిన సంగ‌తి తెలిసిందే.

అంకిత భావంతో పార్టీకోసం ప‌నిచేసిన రోజా గెలిస్తే మంత్రి ప‌ద‌వి కావ‌డం ఖాయ‌మ‌నే వార్త‌లు నిపించాయి. అయినా కూడా రోజా ఓడిపోతుంద‌ని కొన్ని స‌ర్వేలు చెప్పినా రోజా మాత్రం జ‌గ‌న్ మేనియాతో ఘ‌న‌విజ‌యం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో రోజా గెలుపొందడంతో …ఆమెకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐదేళ్లలో వైసీపీలో ఉంటూ టీడీపీపై పోరాటం చేసిన అనేకమంది నేతలు… జగన్ కేబినెట్‌లో తమకు చోటు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఈ జాబితాలో నగరి ఎమ్మెల్యే రోజా కూడా ఉందని…ఆమెకు జగన్ కేబినెట్‌లో తనకు కీలక శాఖ లభిస్తుందనే భావనతో ఉన్నారని కొద్దిరోజులుగా ప్రచారం కూడా సాగుతోంది. రోజాకు మ‌హిళా,శిసు సంక్షేమ శాఖ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నె చ‌ర్చ పార్టీ వ‌ర్గాల్లో జోరుగా కొన‌సాగుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -