వైసీపీ ప్రభుత్వ పథకాల వార్తల పర్యవేక్షణకు బృందం

1751
YSRCP Welfare Schemes News Monitoring Team
YSRCP Welfare Schemes News Monitoring Team

వైఎస్ జగన్ పాలనకు ఏడాది పూర్తయ్యింది. ఎన్నో గొప్ప సంక్షేమ పథకాలు ప్రారంభించి దేశాన్ని తనవైపుకు తిప్పుకున్నారు సీఎం జగన్. అయితే వైసీపీ ప్రభుత్వానికి మద్దతుగా స్వల్ప మీడియా ఉండడం.. ప్రతిపక్షాలకు తెలుగురాష్ట్రాల్లో బలమైన మీడియా విభాగాలు ఉండడంతో ఎక్కువగా బురదజల్లే వార్తలతో వైసీపీ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. దీనిపై జగన్ ప్రభుత్వం నజర్ పెట్టింది.

తాజాగా వైసీపీ ప్రభుత్వ పథకాల వార్తల పర్యవేక్షణకు ఏపీ ప్రభుత్వం ఒక పర్యవేక్షణ బృందాన్ని ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రసారమైన కథనాలు, వార్తలు , సమాచారంపై పర్యవేక్షణకు ఎనిమిది మందిని ‘రాష్ట్ర సాంకేతిక సమన్వయకర్త’లుగా ప్రభుత్వం నియమించింది. వీరంతా నిరంతరం ఇందుకు సంబంధించిన నివేదికలను రూపొందిస్తూ వాటిని ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో)కు ఎప్పటికప్పుడు నివేదిక అందిస్తారు.

ఈ బృందం సభ్యులను గతంలో ‘సాంకేతిక సమన్వయకర్తలు’గా ప్రభుత్వం నియమించగా… తాజాగా వారి పోస్టుల్ని ‘రాష్ట్ర సాంకేతిక సమన్వయ కర్తలు’గా మారుస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ పర్యవేక్షణ బృందంలో చేకూరి కిరణ్, జక్కం సుధాకర్ రెడ్డి, మల్లాది సందీప్ కుమార్, ఏ.లింగారెడ్డి, కే.పి. ప్రసాద్ రెడ్డి, ఐ.నారాయణరెడ్డి, జి.దశరథరామిరెడ్డి, వై. రాజశేఖర్ రెడ్డి లను సభ్యులుగా గుర్తించింది. వీరంతా రియల్ టైం గవర్నెన్స్ (ఆర్టీజీఎస్) సీఈవో ఆధ్వర్యంలోని విభాగంలో పనిచేస్తారని ప్రభుత్వం నియామక ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఇక నుంచి పత్రికలు, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాల్లో ప్రభుత్వంపై తప్పుడు వార్తలు రాసే వారి పని ఈ బృందం పట్టనుంది.

నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ గురించి స్పందించిన బాలయ్య..!

గుండెలు బాదుకునోళ్లు.. సిగ్గుతో బిగుసుకు పోయారు

పవన్ కళ్యాణ్ కు నాగబాబు తలనొప్పిగా మారాడా ?

జగన్ పాలపై.. వైసీపీలో చేరడంపై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్యామల..!

Loading...