Thursday, April 25, 2024
- Advertisement -

టీటీడీ ఛైర్మెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన వైవి సుబ్బారెడ్డి…

- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి అధ్యక్షునిగా వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బా రెడ్డి శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనను టీటీడీ ఛైర్మన్ గా నియమిస్తూ వైఎస్ జ‌గ‌న్ సంత‌కం చేసిన వెంట‌నే ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. పుట్టా సుధాకర్ యాదవ్ టీటీడీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిన నేపధ్యంలో వైవీ ఛైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు.

మొద‌ట కాలినడకన ఆయన తిరుమల చేరుకున్న వైవి అనంత‌రం కుటుంబ స‌మేతంగా శ్రీవారిని ద‌ర్శించుకున్నారు. గురుడళ్వార్ సన్నిధిలో టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాజకీయ సమీకరణాల రీత్యా ఆస్ధానాన్ని మాగుంట శ్రీనివాసులురెడ్డికి కేటాయించడంతో పార్టీలో ఆయన స్ధానంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎన్నిక‌ల టైంలో జ‌గ‌న్ టీటీడీ ఛైర్మెన్ ప‌ద‌వి ఇస్తాన‌ని న‌చ్చ‌జెప్ప‌డంతో వైవి అల‌క‌ను వీడారు.

అనుకున్న విధంగానె వైసీపీ అత్య‌ధిక మెజారిటీతో అధికారంలోకి రావ‌డంతో వైవి టీటీడీ చైర్మెన్‌గా నియ‌మితుల‌య్యారు.ఎంపీ సీటును త్యాగం చేయ‌డంతో సుబ్బారెడ్డికు టీటీడీ బోర్డు ఛైర్మన్ గా జ‌గ‌న్ అవ‌కాశం క‌ల్పించారు. చైర్మెన్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత మీడియాతో మాట్లాడారు.

శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే భాగ్యం కల్పించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలను తెలియజేశారు. హిందూ సంప్రదాయాలను కాపాడుతూ.. భక్తుల సౌకర్యాలకు అధిక ప్రాధాన్యతన ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. వారంరోజుల్లో కొత్ పాల‌క మండ‌ళి ఏర్పాటు అవుతుంద‌ని సుబ్బారెడ్డి తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -