ప్యాకేజ్‌పై నాగబాబు కామెంట్.. పవన్ టార్గెట్ చేసిన నెటిజన్లు..!

629
Nagababu Tweet About Rs 20 Lakh Crore Atma Nirbhar Bharat Economic Package
Nagababu Tweet About Rs 20 Lakh Crore Atma Nirbhar Bharat Economic Package

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టడంతో… కేంద్ర ప్రభుత్వం ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయట పడటానికి 20 లక్షల కోట్లు ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించిన సగంతి తెలిసిందే. అయితే ఈ ప్యాకేజీ అంకెల గారడీ తప్ప ఇంకేం కాదు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

ఈ ఫ్యాకేజీలో ఇప్పటివరకు విడుదల చేసిన తొలి విడత మొత్తం రూ. 5,94,550 కోట్లు, రెండో విడత రూ. 3,10,000 కోట్లు, మూడో విడత రూ. 1,50,000 కోట్లు, నాలుగు, అయిదు విడతల మొత్తం రూ. 48,100 కోట్లు.. ఇదంతా కలిపితే రూ. 11,02,650 కోట్లు.. అలాగే గరీబ్ కళ్యాణ్ యోజన, ఆర్బీఐ రిలీజ్ ఫండ్ అన్నీ కలిపితే కేంద్ర మంత్రి ప్రకటించిన ఈ అంకె రూ. 20,97,053 కోట్లని లెక్కలు ఇవ్వడంతో ఇది పెద్ద బోగస్ ప్యాకేజ్ అంటూ విమర్శలు చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఈ మొత్తానికి ఈ అంకెల లెక్కలు పెదవాడి ఆకాలి తీరుస్తాయా ? అంటే కాస్త ఆలోచించాల్సిన పరిస్థితి. కేసీఆర్ అయితే.. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ.. పెద్ద బోగస్.. దీన్ని అసలు ప్యాకేజీ అంటారా? పచ్చి దగా, మోసం అంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, మెగా బ్రదర్ నాగబాబు సైతం స్పందిస్తూ.. . 20 లక్షల కోట్లు ప్యాకేజీ ప్రభావం కనిపించడం లేదు.. ఫలితాల కోసం మనం ఇంకా వేచి చూడాల్సిందేనా? అంటూ ప్రశ్నించారు. నాగబాబు ప్రశ్నకు నెటిజన్లు షాకింగ్ రియాక్షన్స్ ఇస్తున్నారు. ’పవన్ కళ్యాణ్ గారూ మొన్న ఈ ప్యాకేజ్‌ని పొగిడావు కదా.. మీ అన్న ఏదో అడుగుతున్నాడు ఆన్సర్ ఇవ్వు’ అంటూ కౌంటర్లు విసురుతున్నారు.

Loading...