Thursday, April 25, 2024
- Advertisement -

లోకేష్‌కు 2014 వైసీపీ సీనే రిపీట్ అవుతుందా…?

- Advertisement -

తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు, సీఎం చంద్ర‌బాబు పుత్ర‌ర‌త్నం నారాలోకేష్ పోటీ చేయ‌డానికి సేఫ్ ప్లేస్ దొరికింది. గ‌త కొద్ది రోజులుగా 175 నియోజ‌క వ‌ర్గాల్లో లోకేష్ గెలిచే సీటు కోసం ప్ర‌య‌త్నాలు చేసిన బాబుకు చివ‌ర‌కు కొడుక్కి గెలిచే సీటు నిర్ణ‌యించారు. అధికారికంగ కాక‌పోయినా అన‌ధికారికంగా భీమిలీ నియోజ‌క వ‌ర్గంనుంచి పోటీ దాదాపు ఖ‌రార‌య్యింద‌నే చెప్పాలి. ప్ర‌స్తుతం ఇక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాస‌రావు మంత్రిగా కొన‌సాగుతున్నారు. ఇక్క‌డ లోకేష్ పోటీ చేస్తే తాను సీటును త్యాగం చేసేందుకు రెడీగా ఉన్నాన‌ని తెలిపారు. లోకేష్ పోటీ చేయ‌రు అనుకున్నారేమో గాని ముందు వెనుకా ఆలోచించ‌కుండా నోరు జారారు.

అయితే లోకేష్ గెలుస్తాడా లేదా అన్న‌దానిపై రాజ‌కీయాల్లో ఆస‌క్తి నెల‌కొంది. లోకేష్ ఇక్క‌డ నాన్‌లోక‌ల్ అభ్య‌ర్తిగా పోటీకి దిగుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసిన విజ‌య‌మ్మ భాజాపా అభ్య‌ర్తి చేతిలో అనూహ్యంగా ఓట‌మిపాల‌య్యారు. భాజాపా, టీడీపీ పొత్తులో భాగంగా ఎంపీగా భాజాపా అభ్య‌ర్తి హ‌రిబాబు నిల‌బ‌డ‌టంతో విజయమ్మ గెలుపు సునాయాసం అనుకున్నారు. కాని అక్క‌డే టీడీపీ అధినేత బాబు త‌న చాణ‌క్య‌నీతిని ప్ర‌దర్శించారు.

వైఎస్ విజ‌య‌మ్మ నాన్‌లోక‌ల్ అనే దాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. నాన్ లోకల్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. పైగా కడప బాంబులతో విరుచుకుపడతారు, ప్రశాంత విశాఖ అల్లకల్లోలం అయిపోతుందని కూడా భయపెట్టారు. సీమ నేతలకు ఉత్తరాంధ్రాతో ఏం పని అంటూ కూడా నిలదీశారు. దాంతో స్ధానికంగా ఉన్న నాయ‌కునికే ప‌ట్టం క‌ట్టారు.

ప్ర‌స్తుతం అలాంటి సీన్ ఇప్పుడు నారా లోకేష్‌కు ఎదుర‌వుతోంది. విజ‌య‌మ్మ నాన్ లోక‌ల్ అయిన‌ప్పుడు సీమ నేత లోకెష్ భీమిలీనుంచి పోటీ చేస్తున్నారు కాబ‌ట్టి ఆయ‌న కూడా నాన్‌లోక‌లే. నాడు తమపైన పగ పట్టి మరీ విజయమ్మను ఓడించిన టీడీపీకి ఇపుడు గుణపాఠం చెప్పడానికి చాన్స్ వైసీపీ రెడీ అవుతోంది. గ‌తంలో బాబు ఎలాంటి స్ట్రాట‌జీని అమ‌లు చేశారో ఇప్పుడు వైసీపీ నేత‌లు కూడా అదే స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నారు. సీమ నేత అయిన లోకేష్‌కు ఇక్క‌డేంప‌ని అటాక్ చేయడమూ జరుగుతుంది. ప్రశాంత భీమిలీలో అశాంతి రాజకీయం కూడా మొదలవుతుందని భయపెట్టడ‌మూ ఖాయం. ఇక్కడ జనం స్థానికులనే గెలిపించడం ఆనవాయితీ. దిగుమతి సరుకులు వస్తే తిప్పి కొడతారని కూడా అంటున్నారు. లోకెష్ తో పోటీ పడుతున్న వైసెపీ అభ్యర్ధి అవంతి శ్రీనివాసరావు తక్కువ క్యాండిడేట్ ఏమీ కాదు, ఆయనకు అంగబలం, అర్ధబలం ఉన్నాయి. పైగా ఆయ‌న‌కు సామాజిక సొంత బ‌లం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్ గెలుపు అవంతి శ్రానివాస్ మీద అంత సుల‌భంగా ఉండ‌ద‌నేది గ‌మ‌నించాల్సిన విష‌యం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -