Thursday, April 25, 2024
- Advertisement -

ఆది పై డీఎల్‌ పోటీకీ రెడీ…?

- Advertisement -

వైసీపీ అభ్య‌ర్తుల ప్ర‌క్రియ పూర్త‌య్యింది. ముఖ్య‌నేత‌లు పార్టీలో చేరిన వెంట‌నే జ‌గ‌న్ రేపు ఇడుపుల‌పాయ‌లో అసెంబ్లీ, ఎంపీ అభ్య‌ర్తుల జాబితాను ప్ర‌క‌టించ‌నున్నారు. ఇద‌లా ఉంటె కడ‌ప ఎంపీ అభ్య‌ర్తి విష‌యంలో జ‌గ‌న్ ఎవ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. క‌డ‌ప జిల్లాలో జ‌గ‌న్ ఆధిప‌త్యాన్ని త‌గ్గించ‌డానికి బాబు చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన బ‌ల‌మైన నేత‌ల‌ను పార్టీలో చేర్చుకున్నారు.

వారిలో ప్ర‌ధానంగా జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదినార‌య‌ణ రెడ్డి. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆదికి బాబు మంత్రిప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దీంతో కొంతైనా జ‌గ‌న్ ఆధిప‌త్యానికి గండి కొట్టొచ్చ‌ని బాబు భావిస్తున్నారు. అయితే ఆది రాక‌ను వ్య‌తిరేకించారు టీడీపీ నేత రామ‌సుబ్బారెడ్డి. ఆది, పీఆర్ ల‌మ‌ధ్య బాబు రాజీ కుదిర్చారు. జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే టికెట్‌కోసం ఇద్ద‌రి మ‌ధ్య ఆధిప‌త్య‌పోరు న‌డుస్తుండ‌టంతో మొద‌టికే మోసం వ‌స్తుంద‌నే స‌మాచారంతో రంగంలోకి దిగిన బాబుఇద్ద‌రి నేత‌ల‌ను బుజ్జ‌గించి క‌డ‌ప ఎంపీగా ఆదిని, జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే సీటును రామ‌సుబ్బారెడ్డి కేటాయించారు .

క‌డ‌ప ఎంపీగా ఆది పోటీ చేస్తుండంతో వైసీపీ కూడా ధీటైన అభ్య‌ర్ధ‌ని రంగంలోకి దింపుతోంది. అయితే ఆదికి పోటీగా ఎవ‌రూ ఊహించ‌ని వ్య‌క్తిని రంగంలోకి దింపుతున్నారు జ‌గ‌న్‌. క‌డ‌ప ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నందుకు నిర‌స‌న‌గా త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే గ‌తంలో క‌డ‌ప బ‌రిలో ష‌ర్మిల, వైఎస్ విజ‌య‌మ్మ, అవినాష్‌ పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. చివ‌రి నిమిషంలో మాత్రం కొత్త పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. మంత్రి ఆదిపై పోటీగా మాజీ మంత్రి డీఎల్‌ను బ‌రిలోకి దింపుతున్న‌ట్లు స‌మాచారం.

ఇప్ప‌టికే డీఎల్ జ‌గ‌న్‌తో సంప్ర‌దింపులు జ‌రిపారు. త్వ‌ర‌లోనె డీఎల్ వైసీపీ కండువా క‌ప్పుకోనున్నారు. నిజానికి వైసీపీకీ త‌రుపున పోటీచేయ‌డానికి అభ్య‌ర్ధులు ఉన్నా గెలిచే ఎంపీ అభ్య‌ర్తుల కొర‌త ఉంది. అందుకే జ‌గ‌న్ బ‌ల‌మైన నాయ‌కుల‌కోసం వేచి చూస్తున్నారు. ఇప్ప‌టికే నెల్లూరు ఎంపీ అభ్య‌ర్ధిగా ఆదాల ప్ర‌భాక‌ర్‌, క‌డ‌ప ఎంపీగా డీఎల్ పేర్లు దాదాపు ఖ‌రార‌యిన‌ట్లు స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -