Friday, April 19, 2024
- Advertisement -

ప్రైవేట్ హాస్పిటల్ లో.. కరోనా చికిత్సకు 10 రోజుల 17.5లక్షల బిల్లు..!

- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కుగానే ఉంది. అయితే కరోనా సోకితే ప్రభుత్వమే చికిత్స చేస్తుంది. ఈ క్రమంలో అందరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడం లేదు. అందుకే కొన్ని ప్రైవేటు ఆసుపత్రిలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అయితే ఇదే సమయం అన్నట్లు ప్రైవేటు ఆసుపత్రులు ప్రవర్తిస్తున్నాయి. కరోనా చికిత్స కోసం దారుణంగా ప్రజల నుండి దోచుకుంటున్నారు.

అయితే హైదరబాద్ లో ప్రైవేటు ఆసుపత్రులు కరోనా చికిత్స కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి 10 రోజుల క్రితం సోమజిగూడా డెక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స నిమిత్తం చేరారు. అయితే అక్కడ ఒక్క రోజుకి లక్షకి పైగా వసూళ్లు చేసింది డెక్కన్ ఆసుపత్రి యాజమాన్యం. 10 రోజులకు 17.5 లక్షల బిల్లు వేశారు. అందులో 8 లక్షలు సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు కట్టారు.

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యనారాయణ రెడ్డి భార్య నిన్న కరోనాతో మృతి చెందింది. ఈ విషయం తెలియడంతో సత్యనారాయణరెడ్డి కూడా నిన్న మృతి చెందాడు. అయితే మరో 8లక్షలు కడితేనే సత్యనారాయణ మృతదేహం ఇస్తామని ఆసుపత్రి యాజమాన్యం సత్యనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. మూడు రోజుల క్రితం సత్యనారాయణ రెడ్డి అన్న కొడుకు హరీష్ కూడా కరోనా తో మృతి చెందాడు.

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : కరోనా విషయంలో జగన్ షాకింగ్ నిర్ణయం..!

విజయసాయి రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పనున్న జగన్..!

వైసీపీ మంత్రులకే వార్నింగ్ ఇచ్చిన రోజా.. ఎందుకు ?

నిమ్మగడ్డ కేసు.. సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -