Thursday, April 25, 2024
- Advertisement -

చంద్రబాబు కు ఎవరు దిక్కు లేకనే అచ్చెన్న ను చేశారా..?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కింజరాపు అచ్చెన్నాయుడు పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.  టీడీపీ మాజీ మంత్రి, కీలక సభ్యుడు, చంద్రబాబు బంటు కుడి భుజం అయిన అచ్చెం నాయుడు ఇటీవలే  ఈ ఎస్ ఐ స్కాం కేసులో జైలుకి వెళ్లి చాలారోజుల తర్వాత విడుదల అయిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లో కలవరం సృష్టించిన ఈ ఎస్ ఐ స్కాం లో ప్రధాన నిందితుడిగా భావించి అచ్చెన్న ను పోలీసులు అరెస్ట్ చేయగా పలుమార్లు బైలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది.. ఎట్టకేలకు ఇటీవలే నిభంధనలతో కూడిన బెయిల్ ని ఇవ్వగా కరోనా వచ్చిందన్న వార్తలు ఆయనపై చాల వైరల్ అయ్యాయి..

 టెక్కలి ఎమ్మెల్యే గా వరుసగా గెలుస్తున్న కింజరాపు అచ్చెం నాయుడు కి అక్కడ ప్రజల మద్దతు బాగానే ఉన్నా స్కాం చేసి అవినీతి కి పాల్పడ్డాడని అపవాదు అయితే ఉంది.. ఇక ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు కళా వెంకట్రావ్ ను తప్పించి టీడీపీ కిరీటం ఈయనకు పెట్టారు.. ఇక 27 మందితో టీడీపీ కేంద్ర కమిటీ.. ఇరవై మందితో పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. కేంద్ర కమిటీలో ముగ్గురు మహిళలకు ఉపాధ్యక్ష పదవులు కల్పించారు. పొలిట్ బ్యూరో పదవికి స్వచ్చందంగా రాజీనామా చేసిన గల్లా అరుణకుమారిని ఉపాధ్యక్షురాలిగా నియమించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, లోకేష్, నిమ్మల , వర్ల రామయ్య సహా.. మరో నలుగురికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.

2019 ఎన్నికల్లో ఘోర ఓటమి చెందిన తర్వాత టీడీపీ పార్టీ ని చాలామంది నమ్మకస్థులు గాలికి వదిలేశారు..కష్ట సమయాల్లో పార్టీ ని ఆదుకుంటారని ఎంతో మంది మీద ఆశలు పెట్టుకున్న చంద్రబాబు ని అందరు మోసం చేసి ఇప్పుడు ఎలాంటి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఒంటరిని చేశారు.. అయితే అచ్చెన్న మాత్రం పార్టీ ఓడిపోయినా నాటినుండి చంద్రబాబు కు, పార్టీ అండగా ఉంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు.. ఒకవిధంగా అచ్చెన్న ను అధికార పార్టీ టార్గెట్ చేసినా చంద్రబాబు వైపు నిలబడడం తో చంద్రబాబు కి అచ్చెన్నా గతంలోకంటే ఇప్పుడు బాగా నచ్చేశారట.. దాంతో ఇప్పటికే అధ్యక్ష పదవిలో ఉన్న కళావెంకట్రావు ని తప్పించి టీడీపీ రాష్ట్ర కిరీటాన్ని అచ్చెన్నకు టాక్..

టీడీపీ కి వెళ్ళిన వైసీపీ నేతలకు తగిన శాస్తి జరుగుతుంది గా..?

ఎన్ని కుప్పిగంతులు వేసిన జగన్ ముందు పనిచేయవు..?

ప్రత్యర్థులను కలిపాడు సరే.. కాపురం మాటేంటి..?

ఏలూరి కూడా జంపింగ్ లిస్టు లో ఉన్నాడే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -