Thursday, April 18, 2024
- Advertisement -

యామినిని ఏమైనా అంటే నీ బండారం బయట పెడుతా : శ్రీరెడ్డి

- Advertisement -

మాధవీలత వర్సెస్ సాధినేని యామిని మధ్య వైరం నడుస్తున్న సంగతి తెలిసిందే. యామినిపై మాధవీలత చేసిన ‘మల్లెపూల’ కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. యామిని ఇటీవల టీడీపీ నుంచి బీజేపీకి వచ్చి బీజేపీ అధికార ప్రతినిధి పదవి దక్కించుకున్నారు. అయితే బీజేపీ యంగ్ లీడర్ మాధవీలత సాధినేని యామినిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యింది. ఆమె పేరు ప్రస్తావించకుండానే ‘మల్లెపూలు’ ప్రస్తావన తీసుకుని వచ్చి కామెంట్స్ చేసింది.

‘మల్లెపూలు బాగా నలిపిందనా ఆమె అధికార ప్రతినిధి? పచ్చ కండువాలు కప్పుకున్నంత కాలం.. బిజెపిని అమ్మనా బూతులు తిట్టి.. ప్రధానిని తిట్టి.. అధ్యక్షుడిని తిట్టి.. ఇపుడు అధికారంలో లేని కారణంగా దేశంలో అధికారంలోకి వచ్చిన పార్టీ కనుక ఇపుడు అందరికి ఇదే దొరికిందే సందుగా కాషాయం కప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా రాష్ట్ర కమిటీ ఏర్పాటు అవ్వలేదు. మరి కొత్తగా వచ్చిన పచ్చ చీరకి కాషాయం అధికార ప్రతినిధి అంటగట్టింది ఎవరు? పార్టీ కోసం పని చేసిన వాళ్ళకి విలువ ఇవ్వరు.

పచ్చ కండువా కప్పుకుని మల్లెపూల వాసన సువాసన గురించి మాట్లాడిన వాళ్ళు అధికార ప్రతినిధులుగా ఏం చేసారని ఇచ్చారు? మల్లెల మరపు మెరుపు నలిపిన కథలు చెప్పారు కనుక?? లేదా అధికారంలో ఉన్నపుడు అదుపు తప్పి మాట్లాడారనా? పార్టీని పనికిమాలిన తిట్లు తిడితేనే అధికారం ఇస్తారని నాకు తెలిసి ఉంటే.. నేను కూడా పక్క పార్టీ కండువా మార్చుకునేదాన్ని’ అంటూ యామినిపై తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేసింది మాధవీలత. అయితే మాధవీ ఇన్ని కామెంట్స్ చేస్తున్నప్పటికి యామిని సైలెంట్ గానే ఉన్నారు. అయితే సాధినేని యామినిపై సంచలన కామెంట్స్ చేసిన మాధవీలతకు కౌంటర్ ఇస్తూ రంగంలోకి దిగింది శ్రీరెడ్డి. మాధవీలత పేరు ప్రస్తావించకుండా.. సాధినేని యామిని జోలికి వస్తే తాట తీస్తా.. నీ బండారం బయటపెడతా అంటూ ఫేస్ బుక్‌లో పోస్ట్‌లను పెట్టింది శ్రీరెడ్డి.

‘నా ఫుల్ సపోర్ట్ సాధినేని యామినికి.. ఆమె గురించి ఎవరైనా పిచ్చి వాగుడు వాగితే తాట తీస్తా.. హిస్టరీ బయటకు తీయాల్సి వస్తుంది’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. నువ్వు థంజెండ్స్ సార్లు.. సారీ!! లక్ష టైమ్స్ మల్లెపూలు పిసికావో మరిచిపోయావా?? అవునులే మీ కులం వాళ్లకి లవ్ లెటర్స్, మిగతా వాళ్లని చూసి ఏడుపు అంటూ కులప్రస్తావన తీసుకుని వస్తూ మరో వివాదాస్పద పోస్ట్‌లు చేసింది శ్రీరెడ్డి. ఇక్కడ యామినికి శ్రీరెడ్డి ఎందుకు సపోర్ట్ చేస్తుందంటే.. గతంలో పవన్ కి సపోర్ట్ గా మాధవీలత మాట్లాడింది. పవన్ కి శ్రీరెడ్డికి పడదు కాబట్టి అందుకే ఈ టైంలో యామినికి శ్రీరెడ్డి సపోర్ట్ చేస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -