Tuesday, April 23, 2024
- Advertisement -

జ‌గ‌న్ ను తిట్టిన మంత్రి రాజ‌కీయ భ‌విష్య‌త్తు అధోగ‌తేనా….?

- Advertisement -

రాజ‌కీయాల్లో నీతి, నిజాయితీ, విశ్వ‌నీయ‌త అనే ప‌దాలు ప్ర‌జ‌లు మ‌ర‌చిపోయి చాలా కాలం అయ్యింది. అయినా కూడా కొంద‌రు మ‌న నేత‌లు ఇంకా వాటినె ప‌ట్టుకొని వేలాడుతున్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో టెలిస్కోపులు పెట్టి వెతికినా క‌నిపించ‌వు. ఒక పార్టీ త‌రుపున గెలిచిన ఎమ్మెల్యేల‌ను నిస్సిగ్గుగా ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హిస్తూ…..పైకి మాత్రం నిప్పు అని చెప్పుకుంటున్నారు నేత‌లు.

రాజ‌కీయాల్లోకి వ‌చ్చేది ప‌దువులు అనుభ‌వించ‌డం కోస‌మే అని భావించే నాయ‌కులు త‌మ అవ‌స‌రం తీరాక వేరేపార్టీలోకి వెల్ల‌డం లాంటి సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. అలాంటి వారిలో జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యె ఆదినారాయ‌ణ ఒక‌రు. 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌రుపున గెలిచి మంత్రి ప‌ద‌వికోసం జ‌గ‌న్ కుటుంబాన్ని నానా మాట‌లు అని బాబుకు ద‌గ్గ‌ర‌కు చేరారు. త‌ర్వాత మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. జిల్లాలో జ‌గ‌న్‌కు చెక్ పెట్టాలంటె ఆదికి మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం త‌ప్ప బాబుకు మ‌రొక దారి లేదు.

త‌న రాజ‌కీయ అవ‌స‌రాల‌కోసం వాడుకొని వారిని నిట్ట‌నిలువునా వెన్నుపోటు పొడ‌వ‌డం బాబుకు ఉన్న విద్య‌ల్లో మొద‌టిది. అలాంటిది ఇప్పుడు ఆదినారాయ‌ణ రెడ్డి పొలిక‌ల్ లైఫే ముగిసిపోనుంద‌నె వార్త‌లు వ‌స్తున్నాయి. దీనికి కార‌ణం చంద్ర‌బాబె.

జ‌మ్మ‌ల‌మ‌డుగు నియేజ‌క వ‌ర్గంలో శ‌త్రువులుగా ఉన్న ఆది, రామ‌సుబ్బారెడ్డి ల మ‌ధ్య రాజీ కుదిర్చి ఒక్క‌టి చేశారు. ఇద్ద‌రు క‌ల‌సి ప‌నిచేయ‌డం వ‌ల్ల జ‌గ‌న్‌కు ఉన్న‌మైలేజ్‌ని త‌గ్గించ‌వ‌చ్చ‌నేది బాబు ప్లాన్‌. పాపం బాబు ప్లాన్ అర్థం చేసుకోలేని ఆది చివ‌ర‌కు త‌న రాజ‌కీయ జీవితానికె ఇప్పుడు చేటు వ‌చ్చేలా ఉంది.

మొద‌టినుంచి ఆది జ‌మ్మ‌ల మ‌డుగునుంచి పోటీ చేస్తాన‌ని చెప్తున్నా బాబు ఒత్తిడితో రామ‌సుబ్బారెడ్డికోసం సీటును త్యాగంచేసి తాను క‌డ‌ప ఎంపీగా పోటీ చేశారు. వైసీపీలో ఉన్న ప్పుడు ఆదికి జ‌గ‌న్ అత్యంత ప్రాధాన్య‌త ఇచ్చేవారు. ఏ స‌మ‌స్య వ‌చ్చినా జ‌గ‌న్ ముందుగా ఆదిని రంగంలోకి దింపేవారు. దీంతో వైసీపీలోనే కాకుండా రాజ‌కీయంగాకూడా ఆదికి మంచి పేరు వ‌చ్చింది.

మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో చంద్ర‌బాబును న‌మ్మి పార్టీ మారారు. మంత్రి ప‌ద‌వి కోసం కండువా మార్చేసిన ఆది పార్టీ మారాక లైఫ్ ఇచ్చిన జ‌గ‌న్‌, వైఎస్ ఫ్యామిలీపై ఘోర మైన‌ వ్యాఖ్య‌లు చేశారు. జ‌మ్మ‌ల మ‌డుగును రామ‌సుబ్బారెడ్డికి కేటాయించిన బాబు అనూహ్యంగా ఆదిని కండ‌ప ఎంపీగా పోటీలో నిలిపారు. మొద‌టి నుంచి కడ‌ప ఎంపీ వైసీపీకీ పెట్ట‌ని కోట‌. అక్క‌డ ఎవ‌రు పోటీ చేసినా ఓడిపోవ‌డం ప‌క్కా. అలాంటిది తెలిసే బాబు ఆదిని అక్క‌డ‌నుంచి పోటీ చేయించారంటె బాబు చాణక్య నీతిని అర్థం చేసుకోవ‌చ్చు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అవినాష్ చేతిలో ఆది ఓట‌మి త‌ప్ప‌ద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన రాకపోయినా జ‌మ్మ‌ల‌మ‌డుగులో మ‌ళ్లీ రామ‌సుబ్బారెడ్డి పెత్త‌న‌మే కంటిన్యూ అయితే ఆదినారాయ‌ణ‌రెడ్డి రాజ‌కీయ భ‌విష్య‌త్తు మాత్రం అధోఘ‌తే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -