Tuesday, April 16, 2024
- Advertisement -

వైఎస్ జ‌గ‌న్‌తో ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ‌ల ఛైర్మ‌న్ భేటీ

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్ ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌క‌ముందె జ‌గ‌న్ పాల‌న‌లో త‌న మార్క్‌ను చూపిస్తున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అభివృద్దిపై ప్ర‌త్యేక దృష్టి సారించారు. టీడీపీ హ‌యాంలో అభివృద్ధి ఎక్క‌డ వేసిన గొంగ‌లి అక్క‌డే ఉన్న సంగ‌తి తెలిసిందే. వైసీపీ పార్టీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నె ఉద్యోగాల క‌ల్ప‌న చేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ ఆదిశ‌గా మొద‌టి అడుగు ముందుకేశారు.. రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించే పారిశ్రామిక వేత్త‌ల‌కు లంచాలు లేకుండా పాద‌ర్శ‌కంగా అనుమ‌తులు ఇస్తామ‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

జ‌గ‌న్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌క‌ముందే దేశంలో బ‌డాపారిశ్రామిక వేత్త ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థ‌ల ఛైర్మ‌న్ కుమార మంగళం బిర్లా జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 26వ తేదీన వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ఢిల్లీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా కుమార మంగ‌ళం బిర్లా ఆయ‌న‌ను క‌లిశారు.ఏపీ భ‌వ‌న్‌కు స్వ‌యంగా ఆయ‌నె వ‌చ్చి కాబోయె సీఎం జ‌గ‌న్‌తో భేటీ అయ్యారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ రాజ్‌దీప్ స‌ర్దేశాయ్ ఉన్నారు.

వీరి భేటీకి ప్రాధాన్య‌త లేన‌ప్ప‌టికి రాష్ట్రంలో ఎక్క‌డెక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు స్తాపించి పెట్టుబ‌డులు పెట్ట‌డానికి గ‌ల అవ‌కాశాల‌గురించి జ‌గ‌న్‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. ఈ భేటీలో వైఎస్ జ‌గ‌న్వెనుక‌బ‌డిన జిల్లాల్లో పెట్టుబ‌డులు పెట్టాల‌ని సూచించిన‌ట్లు తెలిసింది. దీనివ‌ల్ల రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీక‌ర‌ణ ఏర్ప‌డుతుంద‌ని, అన్ని జిల్లాలు స‌మానంగా అభివృద్ధి చెందుతాయ‌ని వైఎస్ జ‌గ‌న్ అభిప్రాయ‌ప‌డిన‌ట్లు చెబుతున్నారు.

ఇప్ప‌టికే రాష్ట్రంలో బిర్లా సంస్థ‌కు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ క‌ర్మాగారాలు ఉన్నాయి. వాటి వ‌ల్ల స్థానికంగా పెద్ద ఎత్తున యువ‌కుల‌కు ఉద్యోగాలు ల‌భిస్తున్నాయి. టెక్స్‌టైల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబ‌డులు పెట్టాల‌ని కుమార మంగ‌ళం బిర్లా భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

జౌళి, ర‌సాయ‌న ప‌రిశ్ర‌మ‌ల్లో భారీ ఎత్తున ఆయ‌న పెట్టుబ‌డులు పెట్ట‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త‌మ సంస్థల కార్య‌క‌లాపాల‌ను విస్త‌రింప‌జేయ‌డానికి ఏపీకీ ప్రాధాన్య‌త ఇస్తామ‌ని ఆయ‌న ఈ సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు హామీ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇదే ఒర వ‌డిని కొన‌సాగిస్తే భ‌విష్య‌త్తులో రాష్ట్రంలోకి మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌లు రావ‌డం గ్యారంటీ.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -